ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ

0
1


ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ


బహుమతి అందుకుంటున్న నవీన

నందివాడ(తాడ్వాయి), న్యూస్‌టుడే: తితిదే నిర్వహించిన 36వ ధార్మిక విజ్ఞాన జిల్లా స్థాయి పరీక్షల్లో తాడ్వాయి మండలంలో ఇద్దరు విద్యార్థినులు ప్రతిభ చూపారు. నందివాడ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నవీన ప్రథమస్థానం, ఎర్రపపహాడ్‌ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని పూజిత ద్వితీయ స్థానం సాధించారు. నవీనకు రూ. 1000 నగదుతో పాటు ప్రశంసా పత్రం, పూజితకు రూ. 750 నగదు, ప్రశంసా పత్రాన్ని ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, సతీష్‌, రంగాచారి, టీటీడీ ధార్మిక విజ్ఞాన పరీక్షల నిర్వాహకులు సీతారామచంద్ర మూర్తి, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా గోసేవ ప్రముఖ్‌ ఈగ గణపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here