ధోనిపై U-టర్న్ తీసుకున్న యోగిరాజ్: ఆర్మీకి సేవలపై ప్రశంసల వర్షం

0
0


హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిత్యం విమర్శించే యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సింగ్ తొలిసారి ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా న్యూస్ 24 స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో యోగిరాజ్ సింగ్ మాట్లాడుతూ 2019 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ఓటమికి ధోనీయే కారణమని తాను చెప్పలేదని అన్నాడు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

“సెమీస్ ఓటమికి ధోని కారణమని నేను అనలేదు. అది నా వర్షన్ కాదు. మీరు కావాలనే ఓ తప్పుడు వ్యక్తిని తప్పు ప్రశ్న అడిగారు” అని చెప్పాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత పారామిలటరీ రెజిమెంట్‌లో సేవలందించేందుకు రెండు నెలల పాటు టీమిండియాకు అందుబాటులో ఉండనని బీసీసీఐకి ధోనీ తెలిపిన విషయం తెలిసిందే.

విండిస్ పర్యటనకు దూరం

విండిస్ పర్యటనకు దూరం

దీంతో ఆగస్టు 3 నుండి ప్రారంభమయ్యే వెస్టిండిస్ పర్యటకు ధోని దూరమయ్యాడు. ధోనినే స్వయంగా తప్పుకోవడంతో అతడి స్థానంలో యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. టెస్టులకు మాత్రం వృద్ధిమాన్‌ సాహాను ప్రత్యామ్నయ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు, 2 టెస్టులు ఆడనుంది.

ఆర్మీకి ధోని రెండు నెలల పాటు సేవలు

ఆర్మీకి ధోని రెండు నెలల పాటు సేవలు

ఆర్మీకి ధోని రెండు నెలల పాటు సేవలందించడంపై యోగిరాజ్ సింగ్‌ని ప్రశ్నించగా ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా యోగిరాజ్ మాట్లాడుతూ “సుదీర్ఘ కాలంగా అతడు దేశానికి సేవలందిస్తున్నాడు. అతడొక లెజెండరీ ప్లేయర్. నేను కూడా ధోని అభిమానినే. అతను క్రికెట్ ఆడిన విధానం, అతను జట్టును నడిపించిన విధానం, అతను తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి” అని అన్నాడు.

పారాచూట్ రెజిమెంట్‌ విభాగంలో

పారాచూట్ రెజిమెంట్‌ విభాగంలో

ఇదిలా ఉంటే, ధోనీ భారత ఆర్మీ పారాచూట్ రెజిమెంట్‌ విభాగంలో తన రెండు నెలల శిక్షణను ప్రారంభించాడు. బుధవారం ధోనీ బెటాలియన్‌తో కలిసి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ బాధ్య‌త‌లు స్వీకరించాడు. క‌శ్మీర్‌లో ఉద్యోగం చేసేందుకు సిద్దమయ్యాడు. జులై 31 నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు 106 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌తో క‌లిసి ధోనీ ప‌నిచేయ‌నున్నాడు.

విక్ట‌ర్ ఫోర్స్‌తో కలవనున్న ధోని

విక్ట‌ర్ ఫోర్స్‌తో కలవనున్న ధోని

క‌శ్మీర్‌లో ఉన్న విక్ట‌ర్ ఫోర్స్‌తో ధోనీ క‌ల‌వ‌నున్నాడు. అక్కడ పారాచూట్ రెజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్ డ్యూటీల‌ను ధోనీ నిర్వర్తించనున్నాడు. భ‌ద్ర‌తా ద‌ళాల‌తో 15 రోజులు పాటు ధోనీ గ‌డ‌ప‌నున్నాడు. ‘భారత క్రికెట్ గొప్ప సేవకులలో ధోనీ ఒకడు. సాయుధ దళాల పట్ల ఆయనకున్న ప్రేమ కూడా అందరికీ తెలుసు. ఆర్మీతో పనిచేయాలని అతని ఆలోచన అద్భుతం. ఆర్మీతో మంచి సమయం గడపాలని కోరుకుంటున్నా. యువతలో అవగాహన పెంచడానికి కూడా సహాయపడుతుంది’ అని ఓ ఆర్మీ అధికారి తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here