ధోని తర్వాత ఎవరు?: నికర ఆదాయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

0
3


హైదరాబాద్: భారత్‌లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒకడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని… ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కొనసాగుతున్నాడు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగేందుకు ధోని సిద్ధమయ్యాడు.

ఇప్పటికే ధోని రిటైర్మెంట్‌పై విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి. ధోని తన భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించాలని… అతడితో సెలక్టర్లు మాట్లాడాలంటూ మాజీ ఓపెనర్ గంభీర్ నేరుగానే విమర్శలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే, ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత అతడి ఎండార్స్‌మెంట్లను ఎవరూ సొంతం చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

No. 4 స్థానంపై కన్నేసిన సురేశ్ రైనా: రీఎంట్రీ అంత సులభంగా దక్కుతుందా?

ఐదో స్థానంలో ధోని

ఐదో స్థానంలో ధోని

గతేడాది ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్-100 ధనవంతుల జాబితాలో మహేంద్ర సింగ్ ధోని రూ. 101.77 కోట్లతో ఆదో స్థానంలో నిలిచాడు. ఇక, మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అయితే రూ. 80 కోట్లతో ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంతే మొత్తాన్ని సంపాదిస్తాడా లేక అతడి సంపాదన తగ్గుతుందా అనేది చూడాలి మరి.

ధోని నికర ఆదాయం, జీతం:

ధోని నికర ఆదాయం, జీతం:

మహేంద్ర సింగ్ ధోని నికర ఆదాయం ప్రస్తుతం సుమారు $111 మిలియన్(రూ. 785 కోట్లు)గా ఉంది. భారత జట్టులో ఐకానికి ప్లేయర్‌గా ఉన్న ధోని వేతనం ద్వారా సుమారు రూ. 35 కోట్లు వరకు అందుకుంటున్నాడు. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంఛైజీకి కెప్టెన్‌గా వ్వవహారిస్తోన్న ధోని ఆయా ప్రాంఛైజీ ద్వారా రూ. 15 లక్షలు అందుకున్నాడు.

బిజినెస్ వెంచర్స్

బిజినెస్ వెంచర్స్

ధోని సొంతంగా బిజినెస్ వెంచర్స్‌ను కూడా కలిగి ఉన్నాడు. ధోని సహా యజమానిగా చెన్నై పుట్‌బాల్ క్లబ్ చెన్నయిన్ ఎఫ్‌సి, రాంచీకి చెందిన హాకీ క్లబ్ రాంచీ రేస్, సూపర్ స్పోర్ట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మహీ రేసింగ్ టీమిండియా తదితర జట్లను ధోని కలిగి ఉన్నాడు.

దీంతో పాటు ప్రముఖ లైఫ్ స్టైల్ బ్రాండ్ ZEVEN కూడా ధోనిదే. అదనంగా పుట్‌వేర్ సెక్షన్ కూడా ఉంది. ప్రముఖ స్టార్టప్ కంపెనీ రన్ ఆడమ్స్‌లో ధోని 25 శాతం స్టాక్స్‌ను కలిగి ఉన్నాడు. అంతేకాదు భారత్‌తో పాటు దుబాయిలో కూడా ధోని క్రికెట్ ఆకాడమీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు:

బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు:

ధోని తన సంపాదనలో ఎక్కువ శాతం సంపాదించేది వీటి ద్వారానే. 38 ఏళ్ల ధోని సుమారు 20కిపైగా ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. క్రీడాకారుల్లో అత్యధిక బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కలిగి ఉన్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ(24) తర్వాత ధోని రెండో స్థానంలో ఉన్నాడు. ధోని ఏయే వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడంటే… Cars24, Indian Terrain, RedBus, Colgate, Panerai, LivFast, Indigo Paints, GoDaddy, Bharat Matrimony, Mastercard India, Sumadhura, Snickers India, Orient, Netmeds.com, Sound Logic, WardWiz, SRMB Steel, Lava, Orient PSPO, Reebok, Boost, Amity University, Gulf Oil, Ashok Leyland, McDowell’s Soda, Big Bazaar, TVS Motors, Sony Bravia, Sonata Watches, Dabur Chyawanprash.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here