ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ అనవసరం.. ఎప్పుడు వైదొలగాలో అతడికి బాగా తెలుసు: ధావన్

0
3


న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ అనవసరం. క్రికెట్ నుండి ఎప్పుడు వైదొలగాలో ధోనీకి బాగా తెలుసు అని భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. గత కొద్దికాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న ధోనీపై విమర్షల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో రెండు నెలల పాటు క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. విండీస్, సౌతాఫ్రికా పర్యటనల నుండి స్వయంగా తప్పుకున్నాడు.

నా ప్రతిభ ఆధారంగానే జాతీయ జట్టుకు ఎంపికయ్యా.. ప్రజలు అర్థం చేసుకోవాలి!!

ధోనీకి మద్దతు:

ధోనీకి మద్దతు:

ప్రస్తుతం ధోనీ రిటైర్మెంట్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది మాజీలు క్రికెట్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చిందని, ఎవరూ సాగనంపకముందే అతడే వెళ్ళిపోవాలి సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం ధోనీకి మద్దతుగా నిలుస్తున్నారు. మద్దతుగా నిలిచిన వాళ్లలో ధావన్‌ కూడా చేరాడు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ రిటైర్మెంట్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

రిటైర్మెంట్‌పై చర్చ అనవసరం:

రిటైర్మెంట్‌పై చర్చ అనవసరం:

‘ఎన్నో ఏళ్లుగా ధోనీ క్రికెట్‌ ఆడుతున్నాడు. ఎప్పుడు క్రికెట్‌ నుండి తప్పుకోవాలో అతడికి తెలుసు. రిటైర్మెంట్ అనేది తన సొంత నిర్ణయం. జట్టు కోసం మహీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. క్రికెట్‌ నుంచి తప్పుకునే సరైన సమయం వచ్చినపుడు అతడు కచ్చితంగా గుడ్‌బై పలుకుతాడు. ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ అనవసరం’ అని ధావన్‌ అన్నాడు.

ధోనీ గొప్ప నాయకుడు:

ధోనీ గొప్ప నాయకుడు:

‘ప్రతి ఆటగాడి సత్తా ఏంటో ధోనీకి బాగా తెలుసు. వారిని ఛాంపియన్‌గా ఎలా మార్చాలో కూడా తెలుసు. తన కెప్టెన్సీతో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. అతడు గొప్ప నాయకుడు. మ్యాచ్‌ను అదుపుచేసే సత్తా అతడి సొంతం. కెప్టెన్‌లలో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌. అతడిపై మాకు గౌరవం ఎప్పటికీ ఉంటుంది. విరాట్‌ కోహ్లీ భారత జట్టులో అడుగుపెట్టినప్పుడు ధోనీ అతడికి ఎంతో సహకరించాడు. అతడు కెప్టెన్‌ అయిన తర్వాత కూడా అండగా నిలిచాడు. గొప్ప నాయకుడి స్వభావం ఇలానే ఉంటుంది. కోహ్లీ కూడా ధోనీకి ఎంతో గౌరవం ఇవ్వడం గొప్ప విషయం’ అని ధావన్‌ పేర్కొన్నాడు.

 తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు:

తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు:

‘యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అపారమైన ప్రతిభ ఉంది. అతను ఇంకా ఎక్కువ మ్యాచులు ఆడలేదు. ఇప్పుడే ఒత్తిడి పెంచొద్దు. పంత్ తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. కచ్చితంగా రాణిస్తాడు’ అని ధావన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో ధావన్‌ 40, 36 పరుగులతో రాణించాడు. టెస్ట్ సిరీస్‌లో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here