నడి రోడ్డుపై నగదు వాన.. చేతికి అందినంత డబ్బును ఎత్తుకెళ్లిన జనాలు!

0
1


రోడ్డుపై ఆకస్మాత్తుగా డబ్బుల వాన కురిసింది. ఇంకేముంది జనాలు తమ వాహనాలను రోడ్డుపై వదిలి అటుగా పరుగులు పెట్టారు. సంతోషంతో చిందులేస్తూ చేతికి అందినంత నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన అట్లాంటాలోని జార్జియా హైవేపై చోటుచేసుకుంది. నగదు తీసుకెళ్తున్న ట్రక్కు డోర్ ఊడటంతో డాలర్ నోట్లు ఎగిరి రోడ్డుపై చిందరవందరగా పడ్డాయి.

దీంతో డ్రైవర్లు తమ వాహనాలను రోడ్ల పక్కన డాలర్ నోట్లను ఏరుకునేందుకు ఎగబడ్డారు. పాదచారులు సైతం తమకు తోచినంత మొత్తాన్ని జేబులు, బ్యాగుల్లో కుక్కుకొని వెళ్లిపోయారు. దీంతో స్థానిక డన్వుడ్ పోలీసులు అక్కడికి చేరుకుని నగదు ట్రక్కుకు, నగదుకు భద్రత కల్పించారు. అనంతరం పోలీసులు తమ ఫేస్‌బుక్‌ పేజీలో ఓ ఫన్నీ పోస్టు పెట్టింది. ‘‘డన్వుడ్ ప్రజల్లారా తలలు పైకెత్తి చూడండి. ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి’’ అంటూ ఈ వివరాలు తెలిపింది.
డన్వుడ్ పోలీసుల ఫేస్‌బుక్ పోస్ట్:
‘‘ప్రజలు రోడ్లపై నోట్లు ఏరుకోవడాన్ని చూసి ఓ వ్యక్తి పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 911కు కాల్ చేశాడు. ఆ సమయంలో సుమారు 15 వాహనాలు రోడ్డు పక్కన నిలిపినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. రోడ్డుపై నగదు దొరికితే ఎవరైనా సరే ఆశపడతారు. కానీ, అలా డబ్బును తీసుకెళ్లడాన్ని మేం దొంగతనంగానే భావిస్తాం. ఆ డబ్బును ప్రజలు తిరిగి ఇవ్వాలి. నగదు ట్రక్ పక్క తలుపు తెరుచుకోవడం వల్ల అందులో ఉన్న డబ్బంతా రోడ్డుపై పడింది. ఆ సమయంలో ట్రక్ వేగంగా ప్రయాణిస్తుండంతో నోట్లు గాల్లో ఎగిరాయి. ఈ ఘటన వల్ల అక్కడ ట్రాఫిక్ స్తంభించలేదు. పాదచారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగలేదు’’ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 17500 డాలర్లు (భారత కరెన్సీలో రూ.1.19 కోట్లు) రోడ్డుపాలైనట్లు పోలీసులు అంచనా వేశారు.
గాల్లో ఎగురుతున్న నోట్ల కోసం ప్రజల పాట్లను ఈ వీడియోలో చూడండి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here