నన్ను హ్యాండిల్ చేయడం కష్టం.. చాలా ధైర్యం ఉండాలి: అనసూయ

0
2


బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ నటిగానూ రాణిస్తున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ ‘నాగ’ సినిమాతో అనసూయ తన నటజీవితాన్ని మొదలుపెట్టారు. కారణాలేమిటో తెలియదు కానీ, ఆ తరవాత ఆమె సినిమాల్లో నటించలేదు. పెళ్లి జరిగి, పిల్లలు పుట్టిన తరవాత యాంకర్‌గా బుల్లితెరలోకి అడుగుపెట్టారు. అనతికాలంలోనే స్టార్ యాంకర్‌గా ఎదిగారు. ఈ క్రమంలో ‘క్షణం’ సినిమాలో పోలీస్ అధికారిణి పాత్ర చేయడానికి అంగీకరించారు.

అయితే, ఈ సినిమా రావడానికి ముందే ‘సోగ్గాడే చిన్న నాయన’ సినిమాలో నాగార్జున మరదలిగా నటించేశారు అనసూయ. ఇక ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర అనసూయకు ఎంత మంచి పేరుతీసుకొచ్చిందో తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసిన తరవాత తొలిసారి లీడ్ రోల్‌లో నటించారు అనసూయ. ఆ సినిమానే ‘కథనం’. రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శక‌త్వం వహించారు. ది గాయ‌త్రి ఫిల్మ్స్, ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై బి.న‌రేంద్రరెడ్డి, శ‌ర్మచుక్కా సంయుక్తంగా నిర్మించారు. రోషన్ సాలూరి సంగీతం సమకూర్చారు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌ కిషోర్‌, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈనెల 9న ‘కథనం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సినిమా ప్రచారంలో భాగంగా అనసూయ, ధన్‌రాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాంకర్ మంజూష వీళ్లని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలతో పాటు చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటనల గురించి అనసూయ, ధన్‌రాజ్ సరదాగా మాట్లాడారు. ఈ సినిమాకు ‘కథనం’ యాప్ట్ టైటిల్ అని ధన్‌రాజ్ చెప్పారు. వాస్తవానికి ఈ టైటిల్‌ను తేజు అనే మరో దర్శకుడు రిజిస్టర్ చేసుకున్నారని, అయితే ఆయన ఇంకా సినిమాను మొదలుపెట్టలేదని చెప్పారు. తాము ఆయన్ని సంప్రదించగా వెంటనే అంగీకరించి టైటిల్‌ను తమకు ఇచ్చేరని ధన్‌రాజ్ వెల్లడించారు.

ఇక అనసూయ మాట్లాడుతూ.. ‘‘నేను చాలా సినిమాలకు నో చెప్పాను. చాలా జాగ్రత్తగా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాను. ‘క్షణం’ తరవాత ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ, నా మీద నాకు నమ్మకం లేదు. లీడ్ రోల్‌లో సినిమా మొత్తాన్ని నేను నడిపించలేనేమో అనుకునేదాన్ని. కానీ, ‘కథనం’ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో అంగీకరించాను’’ అని వెల్లడించారు. సినిమా విషయంలో తాను చాలా చిల్డ్‌గా ఉన్నానని అన్నారు. చిత్ర యూనిట్ తనకు ఏం కావాలి అంటే అది చేసిపెట్టిందని చెప్పారు. వాస్తవానికి తనను హ్యాండిల్ చేయడం అంత సులభం కాదని నవ్వుతూ అన్నారు.

భవిష్యత్తులో అనసూయ దర్శకత్వం వహించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ‘‘దానికి చాలా ధైర్యం కావాలి’’ అని సమాధానం ఇచ్చారు. తమ దర్శకుడు రాజేష్‌ను చూసి ఈ విషయం అర్థమైందన్నారు. కాకపోతే, తాను నిర్మాతను అవుతానని చెప్పారు. సినిమాలు కాకపోయినా టీవీ షోలను నిర్మిస్తానని వెల్లడించారు. అయితే, దానికి మరో పదేళ్లు పడుతుందని స్పష్టం చేశారు. అనసూయ, ధన్‌రాజ్ చెప్పిన మరిన్ని విషయాలు కింది వీడియోలో చూడొచ్చు..Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here