నయా దందా..

0
5


నయా దందా..

నవీకరణ పేరిట దోపిడీ

రూ.లక్షకు రూ.2 వేలు వసూలు

బ్యాంకుల వద్ద దళారుల ఆగడాలు

ఖరీఫ్‌ పంట రుణాల నవీకరణ కోసం బ్యాంకుకు వెళ్లిన రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారు. రుణమాఫీ అమలుకు నోచుకోక..చేతిలో చిల్లిగవ్వలేక.. పాత వాటిని నవీకరించుకొనేందుకు బ్యాంకుకు వచ్చే కర్షకులను మధ్యవర్తులు బురిడీ కొట్టిస్తున్నారు. సాయం చేస్తూనే రూ.లక్షకు రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. బీర్కూర్‌లోని ఆయా బ్యాంకుల్లో ఈ దందా మూడు పైసలు.. ఆరు రూపాయలుగా సాగుతోంది.

న్యూస్‌టుడే, బీర్కూర్‌

బీర్కూర్‌ మండలంలోని బ్యాంకుల చుట్టుపక్కల ఉన్న వ్యాపార సముదాయాల వద్ద దళారులు, వడ్డీ వ్యాపారులు అడ్డాలు ఏర్పాటు చేసుకొని దందా కొనసాగిస్తున్నారు. రుణాల నవీకరణ కోసం వచ్చే కర్షకులను బ్యాంకు సిబ్బందే మధ్యవర్తుల వద్దకు వెళ్లమని సఫారసు చేస్తారు. దళారుల వద్దకు వచ్చే రైతులతో రూ.లక్షకు రూ.2 వడ్డీ చొప్పున బేరమాడుకొంటారు. అన్నీ తాము చూసుకొంటామని కర్షకుల చేత పత్రాలపై సంతకాలు చేయించుకొని బ్యాంకులో పాత బకాయిలు కట్టేస్తారు. ఆ తర్వాత రెండు రోజుల్లో కొత్తగా రుణం మంజూరవుతుంది. ఈ మొత్తం నేరుగా దళారి ఖాతాలో జమ చేస్తారు. ఇందుకు బ్యాంకు సిబ్బందికి కొంత మేర ముట్టజెబుతారు.


బీర్కూర్‌ బ్యాంకులో పంట రుణాల నవీకరణ చేయించుకొనేందుకు బారులు తీరిన రైతులు

వారికి అలా.. వీరికి ఇలా..

నవీకరణ రుణాలు ఇవ్వడానికి 2, 3 రోజులు చేస్తున్నారు. అదే సొంత డబ్బులతో రైతులు నేరుగా బ్యాంకులోకి వెళ్తే వారం అయినా మంజూరు చేయడం లేదని వాపోతున్నారు. కొంత మంది దళారులైతే తమకు బ్యాంకులో అందరూ తెలుసని, మీరు నవీకరణకు ఎంత డబ్బులు కట్టాలో చెబితే తామే కట్టేస్తామని, ఎంత త్వరగా అంటే అంత త్వరగా రుణాలిప్పిస్తామని, తమకు వడ్డీ చెల్లించాలని బాహాటంగా చెబుతున్నారు. కొందరైతే ఏకంగా రైతుల పత్రాలను తీసుకొని పాత రుణాలను చెల్లించి, కొత్తవి ఇప్పించి వారి డబ్బులను వారు తీసుకొంటున్నారు. అంటే రైతుకు చేస్తున్న సాయానికి రూ.2 చొప్పున వడ్డీ తీసుకొంటున్నారు. అదీను కేవలం రెండు, మూడు రోజులకే ఇంత మొత్తంలో వస్తుంది. అదే డబ్బును తిరిగి మరొక రైతుకు సాయం రూపంలో అందజేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఉన్న కొంత మొత్తాన్నే వడ్డీలకు తిప్పుకొంటూ భారీగా ఆర్జిస్తున్నారు.

డబ్బులు చెల్లించాను

– వెంకటేశం, రైతు, బీర్కూర్‌

నాకు 6.20 ఎకరాల భూమి ఉంది. బ్యాంకులో పంట రుణం రూ.2.50 లక్షలు చెల్లించాలి. అంత డబ్బు నా వద్ద లేదు. బ్యాంకు లోపల ఓ దళారి నా వద్దకు వచ్చి పాత రుణం చెల్లిస్తానని చెప్పి రూ.4 వేలు వడ్డీ తీసుకొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here