నరేంద్ర మోడీ గుడ్‌న్యూస్.. కేంద్ర ఉద్యోగులకు భారీ ఊరట

0
0


నరేంద్ర మోడీ గుడ్‌న్యూస్.. కేంద్ర ఉద్యోగులకు భారీ ఊరట

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్ 1972ను సవరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుంది. సర్వీస్‌లో చేరిన ఉద్యోగి మరణిస్తే 54 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్ 1972 ప్రకారం సదరు ఉద్యోగి ఫ్యామిలీ పెన్షన్ పొందవచ్చు. వీటిలో మార్పులు చేసి, ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది.

వారికి 30 శాతమే పెన్షన్..

నాటి రూల్ ప్రకారం అతని కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ కింద ఉద్యోగి చివరగా తీసుకున్న వేతనంలో 50 శాతం వారి కుటుంబానికి చెల్లిస్తుంది. అయితే విధుల్లో చేరిన ఏడేళ్ల తర్వాత మరణించిన ఉద్యోగి కుటుంబానికి మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది. 7 ఏళ్ల లోపు కనుక ఉద్యోగి మృతి చెందితే సదరు ఎంప్లాయ్ ఫ్యామిలీకి చివరి వేతనంలో 30 శాతం మాత్రమే పెన్షన్ అందుతోంది.

పదేళ్ల పాటు 50 శాతం పెన్షన్

పదేళ్ల పాటు 50 శాతం పెన్షన్

దీనిపై మోడీ ప్రభుత్వం సవరణలు చేసింది. ఇక నుంచి ఇలాంటి వారికి కూడా 50 శాతం పెన్షన్ అందుతుంది. ఇళా పదేళ్ల వరకు పెన్షన్ పొందుతారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుంది. కేంద్రం సెప్టెంబర్ 19న నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని తెలిపింది. ఈ సవరణతో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ సహా వివిధ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.

వేతనం తక్కువ.. అందుకే..

వేతనం తక్కువ.. అందుకే..

సెప్టెంబర్ 24వ తేదీన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవాన్స్ అండ్ పెన్షన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులు ఎవరైనా మృతి చెందితే ప్రస్తుత పరిస్థితుల్లో వారి కుటుంబానికి ఎక్కువ పెన్షన్ అవసరమని ప్రభుత్వం గుర్తించిందని పేర్కొంది. ప్రారంభ వేతనం తక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో నిబంధనను సవరించినట్లు తెలిపింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here