నల్లవెల్లిలో కత్తిపోట్ల కలకలం

0
0


నల్లవెల్లిలో కత్తిపోట్ల కలకలం

క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్తున్న సిబ్బంది

ఇందల్‌వాయి, న్యూస్‌టుడే: భార్యను కాపురానికి పంపించట్లేదనే కారణంతో ఓ వ్యక్తి అత్తా, మామలపై కత్తితో దాడి చేసిన ఘటన ఇందల్‌వాయి మండలం నల్లవెల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండల కేంద్రానికి చెందిన రవీంద్రాచారికి నల్లవెల్లికి చెందిన కమ్మరి ఉమతో 27 ఏళ్ల క్రితం వివాహమైంది. కూతురు జన్మించిన కొన్నాళ్లకు మద్యానికి బానిసైన ఆయన అనారోగ్యం పాలయ్యాడు. ఆరేళ్ల క్రితం కూతురును బంధువులకు అప్పగించిన భార్య అజ్ఞాతంలో జీవిస్తోంది. రెండు రోజుల కిందట ఉమ నల్లవెల్లికి వచ్చిన విషయం తెలుసుకున్న రవీంద్ర భార్యను తనతో పంపించాలని అత్తా, మామలతో గొడవకు దిగాడు. వాళ్లు నిరాకరించడంతో వెంట తెచ్చుకొన్న కత్తితో అత్తపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన మామను నెట్టేయడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటనలో భార్యకు కూడా స్వల్పంగా గాయమైంది. స్థానికులు నిందితుణ్ని పట్టుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here