నవంబర్‌ 8న `తిప్పరా మీసం`

0
5


కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తిప్పరామీసం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్‌.

నవంబర్ 8న ఈ సినిమా విడుదల చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ యాక్షన్ డ్రామాను ఎల్‌ కృష్ణ విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు లుక్స్‌, యాక్టింగ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందంటున్నారు.

Also Read: రాఘవుడు కత్తి దూసి ఏడాదయ్యింది!

అతి త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేసి ఆడియో విడుదల వేడుక కూడా అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిప్పరా మీసం తెలుగు రాష్ట్రాల థియెట్రికల్ హక్కులను ఏసియన్ సినిమాస్ సునీల్ ఫ్యాన్సీ అమౌంట్‌కు సొంత చేసుకున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందించారు.

నిక్కీ తంబోలి హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. తిప్పరామీసం సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ ఓం సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు ఈ మధ్యే మంచి విజయం అందుకోవడంతో తిప్పరామీసం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Also Read: Sye Raa 10th Day Collections: మెగాస్టార్‌కు దాసోహమన్న బాక్సాఫీస్‌Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here