నవ్వు తెచ్చిన తంటా.. తెరిచిన నోరు మూయలేక మహిళ పాట్లు

0
1


వ్వు ఆరోగ్యానికి మంచిదే. అలాగని గట్టిగా నవ్వారంటే మాత్రం ఈ మహిళలా ఇబ్బంది పడాల్సిందే. చైనాలోని హైస్పీడ్ రైల్‌లో ప్రయాణిస్తున్న మహిళ.. తోటి ప్రయాణికుడు వేసిన జోకుకు పగలబడి నవ్వింది. చాలా సేపు ఆమె నోరు బార్లా తెరిచి నవ్వడంతో ఆమె దవడలు పట్టేశాయి. దీంతో ఆమె నోరు మూయలేక, మాాట్లాడలేక ఇబ్బంది పడింది.

Read also: కంటిలోకి దూసుకెళ్లిన కుక్కర్ విజిల్.. బాధతో విలవిల్లాడిన మహిళ

ప్రయాణికులు వెంటనే రైలు సిబ్బందికి ఈ సమాచారం చేరవేశారు. రైలు లువో వెన్షెంగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే అధికారులు ఓ వైద్యుడిని ఆ రైలులోకి పంపారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా వైద్యుడు డాక్టర్ వెన్షెంగ్ మాట్లాడుతూ.. ‘‘ఇందులో నాకు ఎలాంటి నైపుణ్యం లేదు. కానీ, నోటి దవడలను తిరిగి సాధారణ స్థితికి తెచ్చే విధానంపై మాత్రం కాస్త అవగాహన ఉంది. అయితే, నేను పూర్తిగా నీ సమస్య తీర్చగలననే నమ్మకం నాకు లేదని ఆమెకు చెప్పాను’’ అని తెలిపారు.

Read also: కుక్కకు ఆహారంగా రేపిస్టు అంగం.. అతడిని కొరుక్కుని తింటుంటే వీడియో!

అయితే, డాక్టర్ వెన్షంగ్ ప్రయత్నం చివరికి ఫలించింది. ఆమె నోరు దవడలు మళ్లీ మూసుకున్నాయి. గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు ఎక్కువగా వాంతులు చేసుకొనేదని, ఆ సమయంలో దవడలు వదులుగా మారాయని వైద్యుడు తెలిపారు. మళ్లీ ఎప్పుడైనా ఇలా నోరు తెరిచి గట్టిగా నవ్వితే ఇదే పరిస్థితి ఏర్పడుతుందని ఆ మహిళను హెచ్చరించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here