నష్టాలివే.. అంగీకరించం: ఫారన్ కరెన్సీ బాండ్స్‌పై మోడీకి ఆరెస్సెస్ షాక్

0
2


నష్టాలివే.. అంగీకరించం: ఫారన్ కరెన్సీ బాండ్స్‌పై మోడీకి ఆరెస్సెస్ షాక్

న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో నిధులను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నాటికి విదేశాల్లో సావరిన్ బాండ్స్ జారీ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ప్రణాళికా సంఘం మాజీ వైస్ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వంటి వారు తప్పుబట్టారు. బీజేపీకి మద్దతుదారుగా ఉండే స్వచ్చంధసంస్థ ఆరెస్సెస్ కూడా దీనిని తప్పుబడుతోంది.

అలా జరగనివ్వం.. ఇది అంగీకరించే ప్రసక్తి లేదు

ఫారన్ కరెన్సీ బాండ్స్ ద్వారా నిధులు సమీకరించాలనే నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఆరెస్సెస్ డిమాండ్ చేస్తోంది. ఇది లాంగ్ టర్మ్‌లో దేశానికి ఆర్థిక ఇబ్బందులు కొనితెచ్చే నిర్ణయమనిపేర్కొంది. మన దేశ విధానాలను విదేశాలకు చెందిన ధనవంతులు, వారి ఆర్థిక సంస్థలు నిర్దేశించే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా జరగడానికి అంగీకరించే ప్రసక్తి లేదని ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ (SJM) కో-కన్వీనర్ అశ్విన్ మహాజన్ అన్నారు.

రూపాయి విలువ వేగంగా తగ్గుతుంది

రూపాయి విలువ వేగంగా తగ్గుతుంది

ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని తాము బలంగా విశ్వసిస్తున్నామని అశ్విన్ మహాజన్ అన్నారు. గవర్నమెంట్ లోటును పూడ్చుకునేందుకు ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి లోన్స్ తీసుకున్న దేశాల అనుభవాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ దేశాలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో చూడాలని అభిప్రాయపడ్డారు. నిధుల సమీకరణ కోసం మనం బయటకు (అంతర్జాతీయ మార్కెట్) వెళ్తున్నామంటే మన రూపాయి విలువ వేగంగా తగ్గుతుందని, అలాగే టారిఫ్ తగ్గించాలని విదేశీ ప్రభుత్వాలు డిమాండ్ చేసే పరిస్థితి వస్తుందన్నారు.

వాళ్లే లాభపడతారు..

వాళ్లే లాభపడతారు..

కేవలం ఆరెస్సెస్ మాత్రమే కాదు, ఇతర వర్గాల నుంచి కూడా ఫారెన్ కరెన్సీ బాండ్స్ పైన విమర్శలు వచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్లు అనుకూలంగా ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టి, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఉపసంహరించుకుంటారని రఘురాం రాజన్ ఇటీవల చెప్పారు. సావరిన్‌ బాండ్స్ (ప్రభుత్వ రుణ పత్రాలు) పేరుతో ఫారెన్ కరెన్సీ బాండ్స్ ప్రతిపాదనను అహ్లూవాలియా తప్పుబట్టారు. యూపీఏ హయాంలోనూ ఈ ప్రతిపాదన చర్చకు వచ్చిందని, కానీ దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉండడంతో ఆ ప్రతిపాదనను విరమించినట్లు చెప్పారు. చెల్లింపుల సమయంలో తీవ్ర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నేరుగా విదేశీ మార్కెట్లోకిసావరిన్ బాండ్స్ జారీ చేయడం వల్ల మర్చంట్ బ్యాంకర్లు మాత్రమే కమీషన్ల రూపంలో లాభపడతారని చెప్పారు. విదేశీ మారక ద్రవ్యం కోసమే అయితే ఇందుకు బాండ్స్ అవసరం లేదని, ప్రభుత్వ రుణ పత్రాల్లో FPIల పెట్టుబడుల పరిమితిని పెంచితే చాలన్నారు. అలా చేస్తే మన కేపిటల్ మార్కెట్లు లాభపడతాయని చెప్పారు. వీలైనంతగా ప్రభుత్వ రుణాలను రూపాయిల్లోనే సమీకరిస్తే మంచిదన్నారు. అయితే దేశీయ రుణ సేకరణకు ప్రత్యామ్నాయంగా, కొద్దిపాటి పరిమితితో ప్రభుత్వం విదేశాల్లో సావరిన్ బాండ్స్ జారీ చేయవచ్చునని చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఈక్విటీలో ప్రభుత్వ వాటా తగ్గించాలన్న ప్రతిపాదనను మాత్రం అహ్లూవాలియా సమర్థించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here