నష్టాల్లో ప్రారంభమై, కుదురుకంటున్న మార్కెట్లు

0
0


నష్టాల్లో ప్రారంభమై, కుదురుకంటున్న మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆర్థిక మందగమన భయంతో మూడు రోజులు నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్లు ఈ వారంలో క్లోజింగ్ డే కూడా నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం గం.9.35 నిమిషాలకు సెన్సెక్స్ 311 పాయింట్లు కోల్పోయి 36,161 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 87 పాయింట్లు నష్టపోయి 10,654 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

ఆ తర్వాత పదకొండు గంటల సమయానికి సెన్సెక్స్ పుంజుకుంది. 28.34 (0.078%) లాభంతో వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 31.65 (0.29%) లాభంతో 10,773.00 వద్ద ట్రేడ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.01 వద్ద ట్రేడ్ అవుతోంది.

వేదాంత, కోల్ ఇండియా, విప్రో, యస్ బ్యాంకు, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవగా, ఐసీఐసీఐ, సిప్లా, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ, ఆటో షేర్లు మినహా మిగతా షేర్లు నష్టాలను చూశాయి.

రూపాయి విలువ తగ్గుతుండటంతో ఐటీ షేర్లు దూసుకెళ్లాయి. ఓఎఫ్ఎస్ఎస్, టీసీఎస్, టాటాఈఎల్ఎక్స్ఎస్ఐ, మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, నిట్ టెక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యస్ బ్యాంకు షేర్లు 7 శాతం లాభపడ్డాయి బ్యాంకు, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎనర్జీ, ఇన్ఫ్రా, ఐటీ, మెటల్ షేర్లు కొనుగోలు చేస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here