నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: 155 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, 11,500 దిగువన నిఫ్టీ

0
1


నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: 155 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, 11,500 దిగువన నిఫ్టీ

ముంబై: మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష, బ్యాంకింగ్ షేర్ల అమ్మకాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపించారు. దీంతో సెన్సెక్స్ 155 పాయింట్లు నష్టపోయి 38,667 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 34 పాయింట్లు కోల్పోయి 11,475 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.75గా ఉంది.

యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ, జీ ఎంటర్టైన్మెంట్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. భారతీ ఎయిర్ టెల్, యాపిల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, సీఈసీ షేర్లు లాభపడ్డాయి.

అంతకుముందు…

భా రత మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.42 సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 71 పాయింట్లు దిగజారింది. మధ్యాహ్నం గం.12.09 నిమిషాలకు సెన్సెక్స్ 287.17 (0.74%) పాయింట్లు కోల్పోయి 38,535.40 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 85.20 (0.74%) పాయింట్లు తగ్గి 11,427.20 వద్ద ట్రేడ్ అయింది. డాలర్‌కతో రూపాయి మారకం విలువ 70.46 వద్ద కొనసాగుతోంది.

అమెరికాలో స్టాక్ ఎక్స్చేంజీలోని చైనా కంపెనీలను ట్రంప్ ప్రభుత్వం డీలిస్ట్ చేయవచ్చుననే ఊహాగానాలు వచ్చాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్ల పైన పడింది. ఉదయం యస్ బ్యాంకు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిష్ టీవీ ఇండియా, అశోక్ లేలాండ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. వొడాఫోన్ ఐడియా, పెనిన్సులా ల్యాండ్, వక్రాంగీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అదానీ లాభాల్లో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ 52వారాల గరిష్టాన్ని తాకాయి.

బంగారం ధర తగ్గింది. నేడు రూ.220 (-0.58%) తగ్గి 37,530.00గా ఉంది. కిలో వెండి ధర రూ.637 (-1.40%) తగ్గి 44,880.00గా ఉంది. క్రూడాయిల్ ధర పెరిగింది. బ్యారెల్‌కు 20 (+0.51%) పెరిగి 3954.00గా ఉంది.

మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్…

HCL Tech ప్రైస్ రూ.1,074.90. ఇది రూ.33.85 లేదా 3.25% పెరిగింది.

ఇన్ఫోసిస్ ప్రైస్ రూ.800.50. ఇది రూ.18.30 లేదా 2.34% పెరిగింది.

యూపీఎల్ ప్రైస్ రూ.594.55. ఇది రూ.12.50 లేదా 2.15% పెరిగింది.

భారతీ ఎయిర్ టెల్ ప్రైస్ రూ.354.45. ఇది రూ.5.35 లేదా 1.53% పెరిగింది.

టీసీఎస్ ప్రైస్ రూ.2,085.15. ఇది రూ.29.00 లేదా 1.41% పెరిగింది.

టాప్ లూజర్స్…

యస్ బ్యాంక్ ప్రైస్ రూ.41.75. ఇది రూ.7.00 లేదా 14.36% నష్టపోయింది.

ఇండస్‌ఇండ్ ప్రైస్ రూ.1,382.65. ఇది రూ.98.15 లేదా 6.63% నష్టపోయింది.

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైస్ రూ.259.30. ఇది రూ.14.25 లేదా 5.21% నష్టపోయింది.

సిప్లా ప్రైస్ రూ.423.05. ఇది రూ.16.35 లేదా 3.72% నష్టపోయింది.

వేదాంత ప్రైస్ రూ.152.15. ఇది రూ.5.10 లేదా 3.24% నష్టపోయింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here