నస్రుల్లాబాద్‌లో సినీ బృందం సందడి

0
0


నస్రుల్లాబాద్‌లో సినీ బృందం సందడి


మాట్లాడుతున్న దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి

నస్రుల్లాబాద్‌, న్యూస్‌టుడే: నస్రుల్లాబాద్‌ మండలం కేంద్రానికి చెందిన కానూరి శ్రీనివాస్‌ రాగల 24 గంటల్లో సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఫామ్‌హౌస్‌లో శుక్రవారం సినిమా బృందం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢమరుకం ఫేమ్‌ శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ… నస్రుల్లాబాద్‌ వాసి రాగల 24 గంటల్లో సినిమాకు నిర్మాత కావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. నిర్మాత శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. గత పదేళ్ల నుంచి సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలని అనుకున్న కోరిక నేడు నేరవేరుతుందన్నారు. ఈ నెల 15న విడుదల విడుదలవుతున్న సినిమాను ప్రతిఒక్కరు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు రఘు, నటుడు అభి, సినిమా బృంద సభ్యులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here