నాగాయ్, ట్యుటికోరిన్‌లో మేఘా థర్మల్‌ వెలుగులు

0
0


నాగాయ్, ట్యుటికోరిన్‌లో మేఘా థర్మల్‌ వెలుగులు

విజయానికి చిరునామా మేఘా ఇంజనీరింగ్‌… జాతీయ స్థాయిలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేసిన ఎంఇఐఎల్‌ తాజాగా థర్మల్‌ విద్యుత్‌ రంగంలో కూడా విజయవంతంగా తన ప్రస్థానాన్నిప్రారంభించింది. ఇప్పటికే దేశంలో జల విద్యుత్‌, సోలార్‌ విద్యుత్‌ సరఫరా ప్రాజెక్ట్‌లను రికార్డ్‌ సమయంలో పూర్తి చేసి రికార్డులకెక్కిన మేఘా తాజాగా తమిళానాడులో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ప్రారంభానికి సిద్ధం చేసింది.

నాగయ్‌ థర్మల్‌ ప్రాజెక్ట్

తమిళనాడులోని నాగాయ్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను ఎంఈఐఎల్‌ ఈపీసీ విధానంలో ఏర్పాటు చేస్తోంది. తమిళనాడు రాష్ట్ర విద్యుత్‌ అవసరాల కోసం నాగాపట్నం వద్ద 230 ఎకరాల్లో కేవికే ఎనర్జీ సంయుక్త భాగస్వామ్యంతో ఎంఇఐఎల్‌ 150 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్‌ కేంద్రాన్ని చేపట్టింది.

మొత్తం 230 ఎకరాలలో 530 టిపిహెచ్‌ (టన్స్‌ పర్‌ అవర్‌) సామర్థ్యంతో కలిగిన బాయిలర్‌, 150 మెగావాట్ల టర్బైన్‌ జనరేటర్‌ ను ఏర్పాటు చేశారు. ఈ బాయిలర్‌ను బీహెచ్‌ఈఎల్‌ సంస్థ తయారు చేసింది. ఈ థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌కు కావాల్సిన 70 శాతం బొగ్గును దేశీయంగా మిగతా బొగ్గును ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో 7 రోజులకు సరిపడా బొగ్గును నిల్వచేయడానికి 114 టిపిహెచ్‌ (టన్స్‌ పర్‌ అవర్‌) సామర్థ్యాన్ని ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేసింది.

125 మీటర్ల ఎత్తు చిమ్నీ (పొగ గొట్టం), ప్లాంట్‌కు కావాల్సిన 3700 టన్నుల స్టీల్‌ను ఎంఇఐఎల్‌ సొంతంగా సరఫరా చేసింది. నాగాయ్‌ థర్మల్‌ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 60 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను 230 కెవి ట్రాన్స్‌మిషన్‌ లైన్ల ద్వారా తిరువూరు విద్యుత్‌ ఉప కేంద్రానికి అనుసంధానం చేశారు. ఇందుకు అవసరమైన 24.6 కిలోమీటర్ల విద్యుత్‌ లైన్లను నిర్మాణాన్ని ఎంఇఐఎల్‌ పూర్తి చేసింది. మొత్తం ప్రాజెక్ట్‌ను ఈ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 130 మెగావాట్లకు ప్రైవేటు ఏజెన్సీలతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు పూర్తి చేశారు.

525 మెగావాట్ల ట్యూటికోరిన్

ఎస్‌ఇపిసి పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బొగ్గు ఆధారిత ట్యూటికోరిన్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ స్టేజ్‌-4 525 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటును తమిళనాడు రాష్ట్రంలోని ట్యూటికోరిన్‌ జిల్లాలో ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తమిళనాడు పవర్‌ జనరేషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (ట్రాన్జెడ్కో) ఎస్‌ఇపిసి సంస్థ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) కుదుర్చుకున్నది.

ఎస్‌ఇపిసి కోసం ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ఎంఇఐఎల్ చేపట్టింది. ఈ విద్యుత్‌ కేంద్రానికి కావాల్సిన స్థలాన్ని వి.ఓ.చిదంబర్‌ పోర్టు నుంచి లీజుకు తీసుకున్నారు. కోల్‌జెట్టి, కన్వేయర్‌, కూలింగ్‌ వాటర్‌ సిస్టమ్‌ వీటితో పాటు వడక్కు కరసేరి గ్రామంలో బూడిద చెరువు (యాస్‌ పాండ్‌)ను 100 హెక్టార్ల స్థలంలో ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేయనుంది. ప్లాంటు నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో వి.ఓ.చిదంబంరం పోర్టు ఉంది. ఈ ప్రాజెక్ట్‌ అవసరమైన బొగ్గును సరఫరా చేసేందుకు గాను దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో ఎంఇఐఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

సివిల్‌ పనులు 90 శాతం పూర్తి కాగా, ఎలక్ట్రో, మెకానికల్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ట్యుటికోరిన్‌లోని విఓ చిదంబరం పోర్ట్‌ ట్రస్ట్‌ ఎస్టేట్‌ పరిధిలోని 36.81 హెక్టార్ల లీజు భూమిలో ఈ ప్లాంట్‌ నిర్మాణం జరుగుతోంది. ఈప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తమిళనాడు జనరేషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(టాన్‌జెడ్‌కో)కు సరఫరా చేస్తారు.

ఈ ప్లాంట్‌లో బీహెచ్‌ఈఎల్‌ తయారు చేసిన 1700 టీపీహెచ్‌ సామర్ధ్యంతో కూడిన బాయిలర్‌, 555 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న టర్బైన్‌, జనరేటర్‌ ఉపయోగించనున్నారు. గంటకు 6700 క్యూమెక్కుల నీటిని సముద్రం నుంచి దీనికోసం తీసుకుంటారు. ఎంఈఐఎల్‌ ఈ ప్లాంట్‌లో 275 మీటర్ల ఎత్తున్న చిమ్నీని నిర్మించింది. పవర్‌ప్లాంట్‌, బంకర్‌ బిల్డింగ్‌కు 15 వేల మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ను తన సొంత యూనిట్‌లో ఫ్యాబ్రికేట్‌ చేసి ఎంఈఐఎల్‌ వినియోగించింది.

విద్యుత్‌ రంగంలో మేఘా వెలుగులు..

దేశంలోనే అత్యంత వేగంగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది మేఘా ఇంజనీరింగ్‌. అనంతపురం జిల్లా నంబూలపూకుంట వద్ద 15 నుంచి 18 నెలల్లో పూర్తి కావాల్సిన 400 బై 200 కెవి సబ్‌ స్టేషన్‌ను ఏడు నెలల్లో మేఘా పూర్తిచేసింది. తెలంగాణకు ప్రాణప్రదమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అవసరమైన మొత్తం విద్యుత్‌ 4627 కాగా అందులో అత్యధికంగా 3057 మెగావాట్ల భారీ విద్యుత్‌ వ్యవస్థను ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే దేశంలోనే తొలిసారిగా వడోదరా బ్రాంచ్‌ కాలువపై 10 మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాన్ని సర్ధార్‌ సరోవర్‌ నర్మదా నిగమ్‌ లిమిటెడ్‌ కోసం ఐదు కిలోమీటర్ల పొడవున ఎంఈఐల్‌ ఏర్పాటు చేసింది.

అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ కెపిఎంజీ ప్రపంచంలోని వంద సృజనాత్మక మౌలిక సదుపాయాల ఆవిష్కరణ ప్రాజెక్టుల్లో ఇది ఒకటని పేర్కొంది. మహారాష్ట్రలోని ధూలే జిల్లా సాక్రి వద్ద 50 మెగావాట్లు, చంద్రాపూర్‌ వద్ద రెండు మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను మహా జెన్‌కో కోసం ఎంఈఐఎల్‌ ఫొటోవోల్టిక్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here