నాడు నగ్నంగా కనిపించింది.. నేడు వీడ్కోలు చెప్పింది!

0
3


టీవల తన నగ్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి షాకిచ్చిన సార టేలర్.. నేడు అభిమానులను కలవరపరిచే నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ జట్టులో మంచి బ్యాట్స్ ఉమెన్‌గా.. వికెట్ కీపర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సార.. వ్యక్తిగత సమస్యల వల్ల ఆమె సొంతగడ్డపై కొన్నాళ్లు ఆటకు దూరమై.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి అభిమానుల్లో ఆనందం నింపింది.

Read also: నగ్న ఫొటోతో షాకిచ్చిన మహిళా క్రికెటర్.. కారణం మంచిదే!

అయితే, ఈసారి ఆమె మళ్లీ క్రికెట్‌కు దూరమయ్యే నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. డిప్రషన్‌తో బాధపడుతున్న తాను ఇక క్రికెట్‌లో రాణించలేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని తెలిపింది. 30 ఏళ్ల సారా 2006లో ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. మూడు ఫార్మట్లలో 226 మ్యాచ్‌లు ఆడింది.

Read also: సెక్స్ హ్యాట్రిక్.. ముగ్గురు అమ్మాయిలతో క్రికెటర్ షేన్‌వార్న్ శృంగార రచ్చ!

ఇటీవల నగ్న చిత్రంతో మహిళల శారీరక, మానసిక సమస్యలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన ఆమె.. అదే సమస్యతో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా సారా గుర్తింపు తెచ్చుకుంది. మూడు ఫార్మాట్లలో 6,533 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఇప్పటివరకు ఆమె ఆడిన ఆటల్లో 232 మందిని ఔట్ చేసింది. ఆటలో రాణిస్తున్న సమయంలోనే ఆమె డిప్రషన్‌కు లోనుకావడం ఆమె బాగా కలచివేసింది. దీంతో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి ట్రీట్మెంట్ చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here