నాసిరకం పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం

0
0


నాసిరకం పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం

భిక్కనూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: దక్షిణ ప్రాంగణంలోని నూతన భవన నిర్మాణాల్లో నాణ్యతా లోపాలపై  ప్రభుత్వ విప్‌ గోవర్ధన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకుల వినతి మేరకు రెండో సారి ప్రాంగణంలో పర్యటించారు. నూతన భవనాలను పరిశీలించారు.గోడలపై పగుళ్లు ఏర్పడడంతో వర్షానికి భవనాలు తడిసి ముద్ధయ్యాయి. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ..పదిహేను రోజుల్లో నాణ్యతతో కూడిన భవనాలను అప్పగించాలని ఈఈ జగన్నాథ]రావు, ఏఈ రాజన్న, గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అధ్యాపకులు, సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచిలు, నాయకులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here