నా చివరి శ్వాస వరకు నేను నీతోనే ఉంటా: సానియా మిర్జా భావోద్వేగం

0
2


హైదరాబాద్: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కుమారుడు ఇజాన్‌ మీర్జా మాలిక్‌ బుధవారం తన తొలి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సానియా తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేసింది.

ఏడాది క్రితం ఇజాన్ పుట్టినప్పుడు తీసిన ఫొటోను పోస్టు చేస్తూ “ఈ ప్రపంచంలోకి వచ్చి నువ్వు ఏడాది అయింది. ఇప్పుడు నా ప్రపంచం అయ్యావు. నువ్వు తొలిసారి నవ్వినప్పటి సందర్భం నాకు ఇప్పటికీ గుర్తే. నువ్వు ఎక్కడికెళ్లినా ఈ నవ్వునే కొనసాగించాలి. ఐలవ్యూ. నా చివరి శ్వాస వరకు నేను నీతోనే ఉంటాను. నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధించే విధంగా నిన్ను ఆశీర్వదించాలని అల్లాని ప్రార్థిస్తున్నాను” అని కామెంట్ పెట్టింది.

ఇద్దరికీ మాత్రమే డే/నైట్ క్రికెట్ అనుభం: సహచర క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తారా?

View this post on Instagram

Exactly one year since you came into this world and became our world .. you smiled the first day you were born and continue to spread smiles everywhere you go .. my truest,purest most amazing boy .. I LOVE YOU and I promise to be by your side until my last breath .. Happy Birthday my little angel 👼🏽 I pray Allah gives you everything you work towards and desire and continue to grow into the most loving and gentle boy that you already are .. InshaAllah .. Thank you for choosing us my little Izhaan ❤️ #HappybirthdayIzhaan

A post shared by Sania Mirza (@mirzasaniar) on Oct 29, 2019 at 11:25pm PDT

ఇజాన్ మీర్జా మాలిక్ మొదటి పుట్టినరోజున బాలీవుడ్ సెలబ్రిటీలు హ్యూమా ఖురేషితో పాటు నేహా ధూపియాలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు తన సోదరి ఆనమ్‌తో ఇజాన్‌ ఆడుకుంటున్న వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది. గతేడాది ఇదే రోజున సానియా మిర్జా పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

View this post on Instagram

We’ve been looking forward to today for a bit now 😅 #Izzy ☝🏽

A post shared by Sania Mirza (@mirzasaniar) on Oct 30, 2019 at 12:02am PDT

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here