నా బుజ్జి జొన్నా.. దశాబ్దానికోసారైనా స్త్రీలతో ఎంజాయ్ చేయి, లేదంటే పోతావ్: వర్మ ఎటాక్

0
7


వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినీ రచయితపై సంచలన కామెంట్స్ చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ వర్మ రెండు వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొడుతున్నారంటూ జొన్నవిత్తుల వర్మను ఏకిపారేసిన విషయం తెలిసిందే.

ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వర్మ.. రచయిత జొన్నవిత్తులకు ‘జొన్నవిత్తుల చౌదరి’ అని బిరుదు ఇచ్చారు. దీంతో జొన్నవిత్తుల ఘాటుగా స్పందిస్తూ.. రామ్ గోపాల్ వర్మ ఫిలాసఫీ పైన నేను పప్పువర్మ అనే బయోపిక్ తీస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా.. వర్మ బతికున్న శవం లాంటివాడు. ఇలాంటి బరితెగించినవాడు సమాజంలో ఉండకూడదు. ఇతని దిక్కుమాలిన ఆలోచనలు వలన సొసైటీకి కలిగే దుష్పరిణామాలను తొలగించే ప్రయత్నమే ఈ ‘పప్పువర్మ’ అంటూ వర్మని ఏకిపారేశారు జొన్నవిత్తుల.

వీటిపై రివర్స్ కౌంటర్ ఇస్తూ జొన్నవిత్తులపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ వదిలారు వర్మ. ‘ఓ నా బుజ్జి జొన్నా.. నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్. నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి బేబీ.. లేకపోతే ఫ్రస్ట్రేషన్‌తో చచ్చిపోతావ్ జొన్నా. నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్. వాళ్ళ మీద జాలేస్తుంది స్వీట్ హార్ట్.. కానీ ఐ లవ్ యు డా’ అంటూ మంటపెట్టే ఎమోజీలను షేర్ చేశారు వర్మ. మరి దీనిపై జొన్నవిత్తుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here