నింజా కార్ట్ లోకి రూ 350 కోట్ల వాల్ మార్ట్ పెట్టుబడి?

0
3


నింజా కార్ట్ లోకి రూ 350 కోట్ల వాల్ మార్ట్ పెట్టుబడి?

భారత్ ఈ కామర్స్ రంగంపై వాల్ మార్ట్ చాలా ఆశావహంగా ఉన్నట్లుంది. ఈ కామర్స్ రంగంలో దిగ్గజ కంపెనీ ఫ్లిప్కార్ట్ ను కొనుగోలు చేసిన ఈ ప్రపంచ రిటైల్ జైంట్ … ఇప్పుడు మరిన్ని ఈ కామర్స్ రంగం లోని కంపెనీల్లో పెట్టుబడులకు సిద్దపడుతోంది. తాజాగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నింజా కార్ట్ అనే కంపెనీ లో 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ 350 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో వెల్లడించింది. తొలుత సుమారు రూ 70 కోట్లను అందించేందుకు వాల్ మార్ట్ సమ్మతించినట్లు సమాచారం.

తాజా కూరగాయలు, పండ్ల సరఫరా…

నింజా కార్ట్… రైతుల నుంచి తాజా కూరగాయలు, పండ్లు సేకరించి వాటిని నగరాల్లోని రిటైలర్లకు విక్రయిస్తుంది. బిజినెస్ 2 బిజినెస్ విభాగంలో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. నింజా కార్ట్ ఫౌండర్ తిరుకుమారన్ నాగరాజన్ ప్రకారం… నింజా కార్ట్ రోజూ సుమారు 1,400 టన్నుల తాజా కూరగాయలు, పండ్లను 50,000 స్టోర్ లకు సరఫరా చేస్తోంది. ఇందుకోసం దాదాపు 25,000 మంది రైతుల నుంచి వీటిని సేకరిస్తోంది.’

రూ 2,429 కోట్ల వాల్యుయేషన్…

నింజా కార్ట్ ఇప్పటికే పెద్ద పెద్ద ప్రైవేట్ ఈక్విటీ కంపెనీల నుంచి భారీగా నిధులను సమీకరించింది. తాజా వాల్యుయేషన్ ప్రకారం నింజా కార్ట్ విలువ రూ 2,429 కోట్లుగా ఉంది. టైగర్ గ్లోబల్, ట్యాంగ్లిన్ వెంచర్ పార్టనర్స్ వంటి సంస్థలు ఇందులో పెట్టుబడి పెట్టాయి. ఇటీవలే నింజా కార్ట్ టైగర్ గ్లోబల్ నుంచి సుమారు రూ 630 కోట్లను సమీకరించింది. ప్రస్తుతం మరిన్ని నిధుల కోసం అమెజాన్ సహా బడా ఇన్వెస్టర్లతో నింజా కార్ట్ చర్చలు జరుపుతోందని, ఈ క్రమం లోనే వాల్ మార్ట్ ఇందులో పెట్టుబడికి సమాయత్తమవుతోందని తెలిసింది.

ఫ్లిప్కార్ట్ కు మేలు…

ఫ్లిప్కార్ట్ ను 16 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన అమెరికా రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్… భారత్ లో తన పట్టును కొనసాగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. బెస్ట్ పరిచే పేరుతో కాష్ అండ్ చర్ర్య్ బిజినెస్ లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న వాల్ మార్ట్ కూడా తాజా కూరగాయలు, పండ్లను రైతుల నుంచి సేకరించి తన విక్రయ శాలల్లో అమ్ముతోంది. అటు ఫ్లిప్కార్ట్ గ్రోసరీస్ బిజినెస్ లోకి ఎంటర్ ఐంది. గ్రోసరీస్ బిజినెస్ ను మరింత పటిష్టం చేసేందుకు రైతుల నుంచి తాజా కూరగాయలు, పండ్ల సేకరణ నెట్వర్క్ కలిగిన నింజా కార్ట్ లో పెట్టుబడి వల్ల అది ఫ్లిప్‌కార్ట్‌కు ఉపయోగ పడుతుందని వాల్ మార్ట్ భావిస్తోంది.

బిగ్ బాస్కెట్ తో పోటీ…

నింజా కార్ట్ ప్రత్యక్షంగా బిగ్ బాస్కెట్, ఉడాన్ , రెలియానే రిటైల్, అమెజాన్ కంపెనీలతో పోటీ పడుతోంది. ప్రస్తుత పెట్టుబడులతో ఈ కంపెనీ తన నెట్వర్క్ ను మరింత పటిష్ట పరచుకోవడం తో పాటు, టెక్నాలజీ, వినియోగదారులను పెంచుకునేందుకు వినియోగించనుంది. రైతులు, రిటైలర్ల మధ్య మధ్య వార్తులు లేకుండా చేయడం వాళ్ళ రైతులకు సుమారు 20% అధిక ధరలను నింజా కార్ట్ అందిస్తోందట.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here