నిండిన చెరువులు.. పారిన అలుగులు

0
0


నిండిన చెరువులు.. పారిన అలుగులు

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే : బోధన్‌ పట్టణం జలపురంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షం పూర్తిగా అడుగంటిన చెరువుల సామర్థ్యం పెంచుతూ రాగా… బుధవారం నాటి వానతో పట్టణానికి రెండువైపులా ఉన్న చెరువులు అలుగు పారాయి. పట్టణం, పరిసర గ్రామాల నుంచి వరద నీరు కాలువల ద్వారా చెరువుల్లోకి వచ్చి చేరాయి. అర్థరాత్రి నుంచే అలుగులు పారడం మొదలయ్యాయి. బోధన్‌లో 104.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఎడపల్లి: ఎడపల్లి మండలంలోని వాగులు, చెరువు అలుగులు జలకళను సంతరించుకున్నాయి. 78.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులు నిండుకుండలా మారడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుర్నాపల్లి శివారులో పంట పొలాలు నీట మునిగాయి. ఠాణాకలాన్‌లో రెండు ఇళ్లు కూలిపోయాయి.

స్టేషన్‌ఏరియా, తడగామ(నవీపేట): మండలంలో బుధ, గురువారాల్లో కురిసిన వానకు ఓ ఇల్లు కూలిపోగా చెట్టు నేలకొరిగింది. స్టేషన్‌ఏరియాలోని బానావత్‌ బిక్కు నివాస ఇల్లు కూలిపోయింది. బాలుర ఉన్నత పాఠశాలలో చెట్టు వేర్లతో సహా నేలకొరిగింది. తడగామ పెద్ద చెరువు నిండుకోవడంతో అలుగు పారుతోంది. బుధవారం 5.4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు నీటిపారుదల శాఖ ఏఈ శ్రీనివాస్‌ చెప్పారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here