నిండుతున్న గోదావరి

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గోదావరి నది లోకి క్రమ క్రమంగా వరద నీరు వచ్చి చేరుతోంది. మండలంలో గత పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు మహారాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి తొణికిసలాడుతున్నది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90టిఎసిలు) కాగా గోదావరి ఎగువ ప్రాంతమైన మహరాష్ట్రలోని నాందేడ్‌, తెలంగాణాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో గత 15 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు సుమారు 13 వేల క్యూసెక్కుల వరద నీరు శ్రీరాంసాగర్‌ లోకి వచ్చి చేరుతుంది. కాగా శ్రీరాంసాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా బుధవారం నాటికి 1055 అడుగులకు, సుమారు 9 టిఎంసిలకు నీరు చేరింది. ఇంకా 80 టిఎంసిల నీరు చేరాల్సి ఉంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పై భాగాన ఉన్నటి వంటి నందిపేట్‌ మండలంలోని ఎత్తిపోతల పథకాలకు నీరు అందాలంటే సంబంధిత కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలంటే ఇంకో 20 నుండి 30 టిఎంసిల నీరు రావాల్సి ఉంది. గోదావరి ఉరుకులు వేస్తుండంతో మండల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here