నిందితుడిని కఠినంగా శిక్షించాలి

0
0


నిందితుడిని కఠినంగా శిక్షించాలి

కామారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల నిరసన

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తహసీల్దారు విజయారెడ్డిపై పెట్రోలు పోసి నిప్పంటించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని టీఎన్జీవోఎస్‌, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండు చేశారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై తమ నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దారు మృతికి కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవోలు రాజేంద్రప్రసాద్‌, దేవేందర్‌రెడ్డి, టీఎన్జీవోఎస్‌ జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సాయిలు, టీజీవో కార్యదర్శి సాయిరెడ్డి, కలెక్టర్‌ ఏవో పద్మారావు, సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, తహసీల్దార్లు రాజేందర్‌, సతీష్‌రెడ్డి, పవన్‌కుమార్‌, సాయిభుజంగరావు తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here