నిందితులను అరెస్ట్‌ చేయాలి

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడురోజుల కిందట సాటాపూర్‌ గ్రామానికి చెందిన జాదవ్‌ రవిని అదే గ్రామానికి చెందిన వ్యక్తులు కులం పేరుతో దూషించి దాడి చేసిన నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి మూడురోజులు గడుస్తున్నా పోలీసులు అరెస్టు చేయకపోవడం ఏంటని బాధితుడు జాదవ్‌ రవి నాయకులు నితిన్‌ అన్నారు. మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడంతో బాధితులను బెదిరింపులకు గురిచేస్తున్నా అరెస్ట్‌ చేయకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలని, లేనియెడల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో సురేష్‌, నారాయణ, కష్ణ, పోశెట్టి, అశోక్‌, లక్ష్మీ, లావణ్య, శాంతబాయి తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here