నిజాం షుగర్స్‌పై భాజపా రాజకీయాలు

0
2


నిజాం షుగర్స్‌పై భాజపా రాజకీయాలు

బోధన్‌, న్యూస్‌టుడే: నిజాం చక్కెర కర్మాగారాల దుస్థితి ఆధారంగా భాజపా నాయకులు రాజకీయాలు చేస్తున్నారని తెరాస నేతలు ఆరోపించారు. మాజీ ఎంపీపీ గంగారెడ్డి, రైసస అధ్యక్షుడు బుద్దె రాజేశ్వర్‌, రవికిరణ్‌ సోమవారం విలేకరులతో మాట్లాడారు. తెదేపా ప్రభుత్వ హయాంలో చక్కెర మిల్లులు అగాధం వైపు మరలాయని,  తరువాత కాంగ్రెస్‌ సర్కారు సమయంలో క్షీణ దశకు చేరుకున్నాయన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మిల్లు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం సబబుకాదన్నారు. నిజాం షుగర్స్‌ ప్రైవేటీకరణ మొదలుకొని ఆయా పరిణామాలు సంభవించిన ప్రతి సందర్భంలో ఎంపీ తండ్రి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ముఖ్య పదవుల్లో ఉన్నారన్నారు. కర్మాగారాల ప్రస్తుత తీరుపై ఆయన ప్రశ్నించాల్సింది ఆయన తండ్రినని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిల్లు పునరుద్ధరణకు చేయాల్సిన ప్రయత్నాలపై పూర్తి చిత్తశుద్ధితో ఉన్నారని వివరించారు. అందులో భాగంగా కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి సహకార రంగంలో రైతులకు అప్పగించడానికి నిర్ణయించారన్నారు. కర్షకులు ముందుకు రాకపోవడంతో మిల్లు తెరుచుకోలేదన్నారు. వాస్తవాలను వక్రీకరించి తమ పార్టీ పెద్దలను విమర్శించడం సరైందికాదన్నారు. రైతు నాయకులు   శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్‌పటేల్‌ ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here