నిజామాబాద్‌లో చెడ్డీగ్యాంగ్‌ హల్‌చల్‌

0
0


నిజామాబాద్‌లో చెడ్డీగ్యాంగ్‌ హల్‌చల్‌

నిజామాబాద్‌ (నేరవార్తలు) :నిజామాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్‌ ఆదివారం అర్ధరాత్రి హల్‌చల్‌ చేసింది. స్థానిక లలితానగర్‌లో నివాసం ఉండే వ్యాపారి తిమ్మయ్య ఇంట్లో ఈ గ్యాంగ్‌ దోపిడీకి పాల్పడింది. కత్తులు, మారణాయుధాలతో బెదిరించి ఇంట్లో ఉన్న 16 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదును అపహరించారు. అనంతరం ఇంట్లో ఉన్న వారందరినీ ఓ గదిలో బంధించి పారిపోయారు. బాధితులు కిటికీలోంచి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. నిజామాబాద్‌ సీపీ కార్తికేయ, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here