నిద్రలో ఉలిక్కిపడి లేచేవాణ్ని: రామ్‌ చరణ్‌

0
2


మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మించిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి సినిమాకు సూపర్‌ హిట్ టాక్‌ రావటంతో చిత్రయూనిట్‌ ఆనందానికి అవధుల్లేవు. ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకునేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చిత్రయూనిట్‌.

గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైరా నరసింహారెడ్డి సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశాడు చరణ్‌. ఈ సందర్భంగా నిర్మాతగా ఇంత భారీ చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో తాను ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నది కూడా తెలియజేశారు.

Also Read: బాలీవుడ్‌కు ఇస్మార్ట్ శంకర్‌.. హీరో ఎవరంటే..?

గత నెల రోజులుగా తాను ఎంతో ఒత్తిడికి గురవుతున్నట్టుగా చెప్పాడు చరణ్‌. సైరా ప్రమోషన్స్‌ కోసం రాజమౌళిని పర్మిషన్‌తో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌కు కూడా తాను బ్రేక్‌ తీసుకున్నట్టుగా తెలిపాడు. అంతేకాదు సినిమా ప్రొడక్షన్‌ సమయంలో ఒక్కోరోజు నిద్రల్లో ఉలిక్కిపడి లేచేవాణ్ని అన్న చరణ్‌, ఇండస్ట్రీలో నిర్మాతలందరికీ ఇలాంటి అనుభవాలు ఉంటాయన్నారు.

అయితే ప్రస్తుతం సినిమా ఘనవిజయం సాధించటంతో చిత్రయూనిట్ అంతా ఆనందంగా ఉన్నారు. ఒవర్‌సీస్‌లో ఇప్పటికే మిలియన్‌ మార్క్‌ను అందుకున్న సైరా నరిసింహారెడ్డి, ఇండియాలో 90 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్టుగా తెలుస్తుంది. అయితే కలెక్షన్లకు సంబంధించిన అధికారిక వివరాలు చిత్రయూనిట్ వెల్లడించాల్సి ఉంది.

Also Read: బాలయ్యతో బోయపాటి ప్రయోగం.. సరికొత్త లుక్‌లో!

జాతీయ స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటించకగా కన్నడ స్టార్ హీరో సుధీప్‌, తమిళ నటుడు విజయ్‌ సేతుపతిలు కీలక పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో జగపతి బాబు, రవి కిషన్‌, ముఖేష్‌ రుషి, బ్రహ్మాజీ లాంటి నటీనటులు కనిపించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here