నినదించిన కార్మికుడు … నిదానించి ప్రయాణికుడు

0
0


నినదించిన కార్మికుడు … నిదానించి ప్రయాణికుడు

మొదటి రోజు ప్రశాంతంగా సాగిన సమ్మె

పోలీసు బందోబస్తు నడుమ రోడ్డెక్కిన బస్సులు

– న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌, కామారెడ్డి పట్టణం, ఆర్మూర్‌, బోధన్‌ పట్టణం, బాన్సువాడ గ్రామీణం

ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తలపెట్టిన సమ్మె ప్రయాణికులపై ప్రభావం చూపింది. శనివారం పోలీసు బందోబస్తు మధ్య కొన్ని బస్సులు డిపో బయటకు వచ్చాయి. వాహనాలపై రాళ్లు రువ్వకుండా చర్యలు చేపట్టారు. ఆర్టీసీ ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బస్ట్టాండ్ల ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కామారెడ్డిలో ఐకాస ఆధ్వర్యంలో బప్టాండు ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌, ఐకాస ప్రతినిధులు జగన్నాథం, సిద్ధిరాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సిద్ధిరాములు, ఎంసీపీఐ(యు) జిల్లా కన్వీనర్‌ రాజలింగం మద్దతు తెలిపారు

* ఆర్మూర్‌లో బస్టాండు అవతల రోడ్డుపక్కన హోటల్‌వద్ద గుమిగూడిన కొంతమంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకొని తర్వాత వదిలేశారు. భాజపా, కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.

* సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఐకాస నాయకులు బోధన్‌లో రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుణప్రసాద్‌, భాజపా అధ్యక్షుడు సుధాకర్‌చారి, సీపీఐకి చెందిన షేక్‌బాబు, సీఐటీయూ నాయకుడు కుమారస్వామి, ఎంఐఎం ముషీర్‌బాబు, టీఎన్జీవో అధ్యక్షుడు రమేష్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాలని విన్నవించారు.

* తమ సమస్యలు పరిష్కరించే వరకు బస్సులు కదిలేది లేదని బాన్సువాడలో ఆర్టీసీ కార్మికులు ప్రధాన రహదారిపై అరగంట పాటు ధర్నా నిర్వహించారు. పోలీసులు అడ్డుకుని ఆందోళనను విరమింపజేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here