నిప్పటించుకొనిమహిళ ఆత్మహత్య

0
0


నిప్పటించుకొనిమహిళ ఆత్మహత్య

కాలూర్‌(ఇందూరు గ్రామీణం): నిజామాబాద్‌ గ్రామీణ మండలంలోని కాలూర్‌లో దేవిక(28) అనే మహిళ గురువారం నిప్పటించుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. అత్తారింట్లో గొడవల కారణంగా భర్తతో విడాకులు తీసుకొని 9 సంవత్సరాలుగా తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. గురువారం జీవితంపై విరక్తి చెంది కిరోసిన్‌ పోసుకొని నిప్పటించుకొంది. అరుపులు విన్న స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో ప్రభాకర్‌ తెలిపారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here