నిబంధనలివే: టీమిండియా హెడ్ కోచ్‌కి దరఖాస్తు చేసుకుంటున్నారా?

0
5


హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మంగళవారం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, ఈ సారి కొత్తగా వయసు, ఎక్స్‌పీరియన్స్ లాంటి నిబంధనలను విధించింది. దీంతో పాటు కోచ్ పదవి అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు వయసు 60 ఏళ్లకు మించరాదని అందులో పేర్కొంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

హెడ్ కోచ్‌‌తో పాటు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ను తిరిగి నియమించనున్నట్లు బీసీసీఐ అందులో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్దులు జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని బీసీసీఐ పేర్కొంది.

హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి

హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి

హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేయడానికి ముందు 2017, జులై నెలలో కోచ్‌ల ఎంపికకు బీసీసీఐ తొమ్మిది పాయింట్లతో కూడిన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయితే, ఈ సారి మాత్రం అన్ని పదవులకు కేవలం మూడు మార్గదర్శకాలనే నిర్దేశించడం విశేషం. ప్రస్తుతం టీమిండియాకు కొనసాగుతున్న కోచింగ్‌ బృందం కూడా ఈ పదవుల ఎంపిక ప్రక్రియలో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.

టెస్టు హోదా కలిగిన దేశానికి

టెస్టు హోదా కలిగిన దేశానికి

హెడ్ కోచ్‌ పదవికి ఎంపిక అయ్యే అభ్యర్థికి టెస్టు హోదా కలిగిన దేశానికి కనీసం రెండేళ్లు లేదా అసోసియేట్‌ సభ్యదేశం/ ఏ-జట్టు/ఐపీఎల్‌ జట్టుకు మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. దీంతో పాటు ఆ అభ్యర్ధికి కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం కూడా ఉండాలని నిబంధన పెట్టింది.

పదవీకాలం పొడిగింపు

పదవీకాలం పొడిగింపు

బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌లకూ పై నిబంధనలే వర్తిస్తాయని బీసీసీఐ పేర్కొంది. అయితే, ఆడిన మ్యాచ్‌ల సంఖ్యను మాత్రం కుదించడం విశేషం. 10 టెస్టులు లేదా 25 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలి. వయసు 60 ఏళ్లకు మించకూడదు. ప్రస్తుత ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌కు ప్రపంచకప్‌ ముగిసే సమయానికి వారి పదవీ కాలం ముగిసింది.

గడుపు పెంచిన బీసీసీఐ

గడుపు పెంచిన బీసీసీఐ

అయితే, వెస్టిండిస్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని వారి పదవీ కాలాన్ని 45 రోజులకు బీసీసీఐ గడువు పెంచింది. అయితే, ఈ ముగ్గురూ తిరిగి సహాయక బృందంలో చేరే అవకాశం ఉంది. వెస్టిండిస్ పర్యటన ముగిసిన తర్వాత భారత పర్యటకు దక్షిణాఫ్రికా జట్టు రానుంది. భారత్‌లో సఫారీల పర్యటన సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హర్ట్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ శంకర్‌ బసు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేయడంతో వారి స్థానాల్లో కొత్తవారిని నియమించే అవకాశం ఉంది.

రవిశాస్త్రి వయసు 57 ఏళ్లు

రవిశాస్త్రి వయసు 57 ఏళ్లు

ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి వయసు 57 ఏళ్లు. 2014 ఆగస్టు నుంచి 2016 జూన్ వరకు రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్‌గా కూడా పని చేశారు. అయితే, మళ్లీ రవిశాస్త్రిని టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపిక చేస్తే 2023 ప్రపంచకప్‌ వరకు కొనసాగిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here