నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ సమస్యలపై బీజేపీ చేపట్టిన పాదయాత్ర 6 వ రోజు కాటిపల్లి రమణా రెడ్డి నాయకత్వంలో పాత రాజంపేట్‌ , సరంపల్లి గ్రామాల్లో కొనసాగింది. ఈ సంధర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణా రెడ్డి మాట్లాడుతూ అన్ని విలీన గ్రామాల లాగానే పాత రాజంపేట మరియు సారంపల్లి గ్రామాలలో కూడా అనేక సమస్యలు ఉన్నాయన్నారు. కలుషిత నీరు, చెత్త కారణంగా గత రెండు నెలల కాలంలో ఒక్క పాతరాజంపేట్‌ గ్రామంలోనే దాదాపు 50 మంది అస్వస్థకు గురైనా తు తు మంత్రంగా డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి చేతులు దులుపుకున్నారన్నారని, సమస్యకు కారణమైన వాటిని మాత్రం పట్టించు కోలేరని అన్నారు. ఇప్పటికి దోమలు, కలుషిత నీరు ఉన్నాయని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని సమస్యలున్న ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని కమిషన్‌లపై ఉన్న శ్రద్ద సమస్యలపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అధికారుల చేతకాని తనం వల్లే కామారెడ్డి ప్రజలు డెంగ్యూ వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here