నిరుపయోగ బియ్యం తీసుకెళ్లినందుకు కేసు

0
0


నిరుపయోగ బియ్యం తీసుకెళ్లినందుకు కేసు

బోధన్‌, న్యూస్‌టుడే: కేంద్ర గిడ్డంగుల్లో కిందపడి ముక్కిపోయిన బియ్యాన్ని తీసుకెళ్లినందుకు ఇద్దరు హోంగార్డులపై కేసు నమోదు చేశారు. వివరాలివీ.. బోధన్‌లోని సీడబ్ల్యూసీ గిడ్డంగుల్లో నిలువచేసిన ఆహార ధాన్యాలకు కాపలాగా ఇద్దరు హోంగార్డులను వంతుల వారీగా నియమించారు. రైలు వ్యాగన్లలో వచ్చే బియ్యం బస్తాలను ఖాళీ చేసి గిడ్డంగుల్లో కూలీలు భద్రపరుస్తారు. ఆ సమయంలో బస్తాల నుంచి స్వల్పంగా బియ్యం కిందపడతాయి. వ్యాగన్లలో కూడా కొద్దిగా బియ్యం కిందపడి ఉంటాయి. వాటిని పేద కూలీలు పోగుచేసుకొని ఇంటికి తీసుకెళ్తారు. అలాగే వదిలేస్తే వ్యర్థంగా మారుతాయి. నిజం చెప్పాలంటే వాటి గురించి ఎవరూ పట్టించుకోరు. అయితే కాపలా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు హోంగార్డులు వారం నుంచి కిందపడిన బియ్యాన్ని పోగుచేసుకొని తీసుకెళ్లారు. దాన్ని నేరంగా పరిగణించి వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఉదంతం సీడబ్ల్యూసీ ఆర్‌ఎం దృష్టి వెళ్లగా ఆయన విచారణకు ఆదేశించారు. హోంగార్డులు స్కూటీపై బియ్యం బస్తా తీసుకెళ్తున్నట్టు సీసీ కెమెరాల్లో తేలింది. ఆర్‌ఎం ఆదేశాల మేరకు గిడ్డంగి మేనేజర్‌ ఫయాజ్‌ 50 కిలోల బియ్యం చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా కేసు నమోదు చేసినట్టు సీఐ నాగార్జున్‌గౌడ్‌ తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here