నిర్దేశించుకున్న లక్ష్యాల పూర్తికి 30 రోజుల ప్రణాళిక

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను నిర్ణీత సమయంలో ప్రగతిని సాధించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో కామారెడ్డి డివిజన్‌కు జిల్లా పరిషత్‌ సీఈవో కాంతమ్మ , ఎల్లారెడ్డి డివిజన్‌కు డిపీఓ నరేష్‌, బాన్సువాడ డివిజన్‌కు ప్రాజెక్టు డైరెక్టర్‌ చంద్రమోహన్‌ రెడ్డిని ప్రత్యేక అధికారులుగా పర్యవేక్షిస్తారని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీ వార్డులలో పారిశుద్ధ్యం, పచ్చదనం కార్యక్రమాలు ఈ నెల 12వ తేదీలోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. డంపింగ్‌ యార్డ్‌ స్థల సేకరణ ప్రతిపాదనలు ఈ నెల 12వ తేదీలోగా సంబంధిత అధికారులకు పంపాలని తెలిపారు. స్థల సేకరణ చేసిన వైకుంఠధామం, డంప్‌ యార్డులు పనులను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. గ్రామ స్థాయిలో, మున్సిపల్‌ వార్డులలో 15లోగా, మండల స్థాయిలో, మున్సిపాలిటీల స్థాయిలో పద్ధతిలో 18వ తేదీలోగా గ్రీన్‌ ప్లాన్‌ ప్రిపరేషన్‌ పూర్తి చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన 109 గ్రామ పంచాయతీలలో 317 ఎకరాల మంకీ ఫుడ్‌ కోర్ట్‌ సంబంధించి అవసరమున్న చోట 12 తేదీలోగా ఎర్రమన్ను నింపాలని, 15వ తేదీలోగా గుంతలు తీసి 17వ తేదీలోగా మొక్కలు నాటడం పూర్తి చేసుకొని, బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈనెల 25వ తేదీలోగా గ్రామపంచాయతీ వార్షిక ప్లాను, ఐదు సంవత్సరాల వార్షిక ముసాయిదాను తయారు చేసుకోవాలని, 30వ తేదీలోగా తుది యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాలని, వచ్చే అక్టోబర్‌ 5వ తేదీన నిర్వహించే గ్రామ సభలో యాక్షన్‌ ప్లాన్లను తీర్మానం ద్వారా ఆమోదింప చేసుకోవాలని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here