నిర్బంధ నియంత పాలనకు చరమగీతం పాడుతాం

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని కుమార్‌ నారాయణ భవనంలో సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ అధ్యక్షతన ఆదివాసీల ముద్దుబిడ్డ కామ్రేడ్‌ లింగన్న సంతాప సభ శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడితే ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ ఉంటుందని, నిర్బంధం ద్వారా నక్సల్స్‌ను అణచివేస్తే మరింత ఉద్యమాలు బలపడతాయని చెప్పారన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి తెలంగాణలో అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్‌ పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ ధనిక వర్గాలకు ఆదివాసీ గిరిజనుల భూములు లాక్కొని, ఆదివాసీ గిరిజనులు రోడ్డుమీద కుటుంబాలను తెచ్చేవిధంగా నిర్బంధాలు ప్రయోగించి బూటకపు ఎన్‌కౌంటర్లు చేయిస్తున్న తెరాసకు ఉద్యమాల ద్వారా చరమగీతం పాడి స్వరాష్ట్రం నుంచి సాగనంపుతారని హెచ్చరించారు. ముందుగా కామ్రేడ్‌ లింగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు బి.దేవరామ్‌, ముత్తన్న, దాసు, సార సురేష్‌, కిసాన్‌, సత్తక్క, రాజేశ్వర్‌, శివాజీ, నరేందర్‌, నాగరాజు, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here