నిషేధ సమయంలో ధోని సీఎస్‌కేను ఎలా గట్టెక్కించాడంటే!: ఐఐటీ మద్రాసు విద్యార్థులతో శ్రీనివాసన్

0
1


హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయవంతంగా పునరాగమనం చేయడానికి కెప్టెన్‌ ధోని అకుంఠిత పట్టుదలే కారణమని చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులతో అన్నారు.

ఐఐటి మద్రాస్ మరియు ఎంప్లాయర్స్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా నిర్వహించిన “Leadership in turbulent times(సంక్షోభ సమయంలో నాయకత్వం)” 37వ అనే అంశంపై ఎన్ శ్రీనివాసన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రెండేళ్ల నిషేధం రూపంలో చెన్నై సూపర్‌కింగ్స్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2018లో పునరాగమనం చేసింది” అని అన్నారు.

భారత్‌లో 2023 హాకీ ప్రపంచకప్‌: అత్యధిక సార్లు ఆతిథ్యమివ్వనున్న దేశంగా భారత్ రికార్డు

 ఏ రంగంలోనైనా సంక్షోభం తలెత్తొచ్చు

ఏ రంగంలోనైనా సంక్షోభం తలెత్తొచ్చు

“కానీ ధోనీ, చెన్నై సూపర్‌కింగ్స్‌ దానిని అకుంఠిత దీక్ష, మొక్కవోని పట్టుదల, పక్కా ప్రణాళికతో అధిగమించింది. వ్యక్తులు, కార్పొరేట్‌, రాజకీయాలు, పార్టీలు, ఏ రంగంలోనైనా సంక్షోభం తలెత్తొచ్చు. దానిని సవాల్‌గా స్వీకరించి ముందుకు నడవాలి. ఒక్క చెడు నిర్ణయం మన ప్రగతిని 20 ఏళ్ల వెనక్కి నెట్టగలదు” అని శ్రీనివాసన్ అన్నారు.

సంక్షోభాలను ముందుగానే పసిగట్టాలి

సంక్షోభాలను ముందుగానే పసిగట్టాలి

“సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో వ్యక్తులు సంక్షోభాలను ముందుగానే పసిగట్టి ముందుకు సాగాలి” అని శ్రీనివాసన్ ఐఐటీ మద్రాస్ విద్యార్థులతో అన్నారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌, అవినీతి ఆరోపణలతో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ను 2016లో రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

‘Any changes in CSK team?’: నెటిజన్లను ఆకట్టుకుంటోన్న సీఎస్‌కే ఫ్రాంచైజీ సమాధానం

2018లో టైటిల్ విజేతగా

2018లో టైటిల్ విజేతగా

అయితే, తన పునరాగమనాన్ని 2018లో ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన ఘనంగా పలికిన చెన్నై సూపర్ కింగ్స్… గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన పైనల్లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒకటి. ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here