‘నీ కొడుకు చనిపోయాడు’.. బతికుండగానే డెత్ సర్టిఫికెట్, షాకైన తల్లి!

0
5


ప్రభుత్వ అధికారుల లీలలు భలే చిత్రంగా ఉంటాయి. వారు తలచుకుంటా చనిపోయిన వ్యక్తులను కూడా బతికించేస్తారు. లేదా బతికున్న వ్యక్తులను చంపేస్తారు. ఇది కేవలం మన దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా సర్వసాధారణమే. తాజాగా, ఇంగ్లాండ్‌ అధికారులు బతికున్న ఓ యువకుడిని.. రికార్డుల్లో చంపేశారు. అంతేగాక, ఆ సర్టిఫికెట్‌ను నేరుగా అతడి తల్లి చేతిలో పెట్టారు.

Read also: ఈ హోటల్‌లో మగాళ్లు అడుగుపెడితే మడతెట్టేస్తారు!

న్యూకాజిల్‌కు చెందిన జోవాన్ సేయర్స్ అనే మహిళ ఇటీవల డిపార్ట్‌మెంట్ ఆఫ్ వర్క్ అండ్ పెంక్షన్స్(DWP) నుంచి ఓ లెటనక అందుకుంది. అందులో తన 19 ఏళ్ల కొడుకు క్రిస్టోఫర్ చనిపోయాడని ఉంది. ఆ లెటర్ చూడగానే ఆమె చేతులు వణికిపోయాయి. వెంటనే తన కొడుకుకు ఫోన్ చేసి.. బతికే ఉన్నాడని నిర్ధరించుకుంది. ఆ వెంటనే డీడబ్ల్యూపీ అధికారులకు ఫోన్‌చేసి తన కొడుకు బతికే ఉన్నాడని చెప్పడానికి ప్రయత్నించింది. అయితే, అధికారులు ఆ ఫోన్‌కు స్పందించలేదు.

దీంతో ఆమె క్రిస్టోఫర్‌తో కలిసి ఆ సర్టిఫికెట్‌ను చూపిస్తూ ఫొటో దిగింది. తన కొడుకు బతికుండగానే చనిపోయడని సర్టిఫికెట్ జారీ చేశారంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టింది. అది వైరల్‌గా మారడంతో అధికారులు దిగివచ్చారు. వెంటనే ఆమెకు క్షమాపణలు చెప్పి, ఆ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.

Read also:
ఉక్కపోస్తోందని.. నడి రోడ్డుపై దుస్తులు విప్పేసిన మహిళ

తప్పు ఎక్కడ జరిగింది?: పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న జోవాన్ సేయర్స్‌ ఇంటికి అధికారులు తనిఖీకి వచ్చారు. ఆ సమయంలో జోవాన్ తనకు 19 ఏళ్ల కొడుకు ఉన్నాడని చెప్పింది. అప్పటికి ఆమె కొడుకు ఇంట్లో లేడు. దీంతో సిబ్బంది అతడు చనిపోయాడని రాసుకున్నారు. ఆమెకు పంపిన సర్టిఫికెట్‌లో కూడా అతడు చనిపోయాడని రాశారు. దీనిపై క్రిస్టోఫర్ స్పందిస్తూ.. ‘‘సొంత డెత్ సర్టిఫికెట్ చూసుకొనే అవకాశం ఎంతమందికి వస్తుంది చెప్పండి? దీన్ని చూడగానే నిజంగా షాకయ్యా. చాలా దారుణం ఇది’’ అని తెలిపాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here