నీ థియేటర్‌లో మళ్ళీ నా బొమ్మ అంటున్న ఛార్మి.. మీరు సై అంటారా?

0
1


ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలాంటి సంచలనవిజయం అందుకుంది అనేది అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో పాటలకోసమో, ఫైట్స్ కోసమో , లేక సినిమాలో ఉన్న ఊర మాస్ ఎలిమెంట్స్ కోసమో సినిమాని మళ్ళీ మళ్ళీ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ సినిమాని అప్పట్లో అంతలా ఆదరించిన వాళ్ళు ఆ సినిమా బుల్లితెరపై ఎప్పుడు వస్తుందా అని కాచుకుని కూర్చున్నారు. కానీ సైరా వచ్చేవరకు థియేటర్స్ అన్నీ విలవిల్లాడుతున్నాయి. ఒక్క గద్దలకొండ గణేష్ తప్ప ఆ థియేటర్స్‌ని ఆదుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే మళ్ళీ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్‌ని బరిలోకి దింపుతున్నారు. కానీ ఈ సారి తక్కువ థియేటర్స్‌లోనే శంకర్ హవా కొనసాగుతుంది.

Also Read: ముందురావడానికి నో అంటున్న బన్నీ, మహేష్.. దోబూచులాట

అసలు విషయం ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఛార్మింగ్ ప్రొడ్యూసర్ ఛార్మి వెల్లడించింది. అసలు ఇప్పుడు సినిమాలు రెండు మూడు వారలు ఆడడమే గగనం అంటుంటే ఇప్పుడు ఛార్మి మాత్రం ఏకంగా ఇస్మార్ట్ శంకర్‌ని రీ రిలీజ్ చేస్తుంది. అంతరించి పోయిన ఈ ట్రెండ్‌ని మళ్ళీ ఫ్రెష్‌గా రీ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ సారి ఊరికి ఒక్క థియేటర్‌లో మాత్రమే ఇస్మార్ట్ శంకర్ మాస్ జనాలకు మెంటల్ ఎక్కించబోతున్నాడు. ఇంకో సారి ఈ సినిమా చూడలేకపోయాం అనుకున్నవాళ్ళు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చూసి పండగ చేసుకోవచ్చు. పైగా ఆ బంపర్ ఆఫర్ ఒక్కరోజు కాదు ఏకంగా మూడు రోజులపాటు అందుబాటులో ఉంటుంది.

Also Read: సైరా శాటిలైట్ రైట్స్ హక్కులు మరీ అంత తక్కువా…?

రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ పాటలను యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే అదే పాటలను పదే పదే చూస్తూ మిలియన్స్ కొద్దీ వ్యూస్ తెప్పించేస్తున్నారు జనాలు. రెడ్‌బుల్ తాగినట్టు రెచ్చిపోయి రామ్ వేసిన ఊర మాస్ స్టెప్పులు, థియేటర్‌లో ఊపిరి సలపకుండా హీట్ పుట్టించిన నభా, నిధిల అందాలు, తడబడకుండా వరుసపెట్టి అంతా మాట్లాడేసిన నాటు బూతులు అన్నీ మళ్ళీ జనాలకు గుర్తు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఛార్మికి ఉండి ఉండొచ్చు.అందుకే ఇలా ప్లాన్ చేసింది.

అయితే పూరి బర్త్‌డే‌ కి ఒక సూపర్ సర్ప్రైజ్ ఇస్తా అంటూ చెప్పుకొచ్చింది ఛార్మి. ఒకవేళ అది ఇదేనా? ,లేక నిజంగానే ఆ‌రోజు ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఆ సర్ప్రైజ్ ఇది కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అనౌన్స్మెంట్ అయ్యి ఉండాలి. ఒకసారి ఆల్రెడీ అదరగొట్టిన ఇస్మార్ట్ శంకర్ ఈసారి ఎంత పట్టుకొస్తాడు అనేది చూడాలి. మొత్తానికి నీ థియేటర్‌లో నా బొమ్మ వస్తుంది చూడడానికి మీరు రెడీనా అని అడుగుతుంది ఛార్మి…రెడీ అయితే ఇంకెందుకు లేటు ఇస్మార్ట్ శంకర్ టికెట్ కొనుక్కోండి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here