నూత్‌పల్లి  రైతు నిత్యనూతన సాగు

0
1


నూత్‌పల్లి  రైతు నిత్యనూతన సాగు

అధునాతన పద్ధతులతో ఆదర్శ వ్యవసాయం

న్యూస్‌టుడే, నందిపేట్‌

గ్రామంలో సాగవుతున్న మొక్కజొన్న పంట

జిల్లా శివారులోని ఓ మారుమూల పల్లె అది. అయితేనేం వ్యవసాయ రంగంలో ఏ అధునాతన విధానం అందుబాటులోకి వచ్చినా ప్రథమంగా అక్కడివారు అనుకరిస్తున్నారు. వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్ఫలితాలు సాధిస్తున్నారు నందిపేట్‌ మండలం నూత్‌పల్లి గ్రామస్థులు.

నూత్‌పల్లి వాసులు ప్రత్యేక ఆసక్తితో పంటల సాగు విధానాలను పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. పసుపు విత్తనాలను విత్తే, తవ్వే, కలుపు నివారణ, ఎరువులను వేయడానికి వాడే యంత్రాలు.. ఇలా ఏ కొత్త యంత్రం వచ్చినా దానిని తమ గ్రామానికి తీసుకెళ్లి వినియోగిస్తున్నారు. వీరిని చూసి చుట్టు పక్కల రైతులు అనుకరిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతూ…

గ్రామ ప్రజలు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నారు. పంటల సాగులో అవసరం మేరకే ఎరువులను వినియోగిస్తున్నారు. సాధ్యమైనంత మేర సేంద్రియ ఎరువులను వాడుతూ భూసారం దెబ్బతినకుండా చూస్తున్నారు. పశు సంపదను పెంచుతూ పాలతో ప్రత్యామ్నాయ ఆదాయం పొందుతున్నారు.

గ్రామంలోని సేంద్రియ ఎరువు కుప్ప

బిందు సేద్యంతోనే 90శాతం సాగు

గ్రామంలోని రైతులు సుమారు 1500 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా వరి, పసుపు, మొక్కజొన్న, సోయాబీన్‌, కూరగాయలు పండిస్తున్నారు. వర్షాధార పంటైన వరి మినహా మిగతావన్ని 90శాతం బిందు సేద్యంతోనే సాగు చేస్తున్నారు. గత దశాబ్ద కాలం నుంచే ఈ విధానాలతో వ్యవసాయం చేస్తున్నారు. ఇలా నీటిని పొదుపుగా వినియోగిస్తుండటంతో వారికి సాగు నీటి ఇబ్బందులు అంతగా లేవు. ప్రభుత్వం వీరికి మరింత సహకారం అందిస్తే వంద శాతం బిందు సేద్యంతోనే పంటలు సాగు చేస్తామని రైతులు అంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here