నెట్స్‌లో రోహిత్, ధావన్ వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు: ఎవరీ కేశవ్ దబాస్?

0
0


హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆదివారం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు గురువారం నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఢిల్లీలో వాయుకాలుష్య ఆటగాళ్లను ఇబ్బందిపెడుతున్న స్టేడియంలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఈ ప్రాక్టీస్‌లో భాగంగా 19 ఏళ్ల నెట్‌బౌలర్‌ కేశవ్‌ దబాస్‌ టీమిండియా ఓపెనర్లు రోహిత్‌, శిఖర్‌ను ఔట్‌ చేసి ఆశ్చర్యపరిచాడు. ఆఫ్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ ఆవల వేసిన బంతి అమాంతం బౌన్స్ తీసుకుని రోహిత్ శర్మ ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. రోహిత్ శర్మ వికెట్ తీసిన ఆనందంలో సంబరాలు చేసుకుందామని అనుకున్నాడు.

ఢిల్లీలో ఎమర్జెన్సీని తలపిస్తోంది, వాతావరణం భయానకంగా ఉంది: ట్విట్టర్‌లో అశ్విన్

అయితే, వెంటనే రోహిత్ శర్మ బంతిని తీసి బౌలర్‌కు ఇచ్చేశాడు. ఆ తర్వాత మరో అద్భుతమైన బంతికి ధావన్‌‌ను ఔట్ చేశాడు. ధావన్ ప్యాడ్లు, బ్యాటు మధ్యలోంచి వెళ్లిన బంతి వికెట్లను గిరాటేయడం విశేషం. దీంతో రోహిత్, ధావన్ బంగ్లాదేశ్‌తో తొలి టీ20కి ముందు నెట్ సెషన్‌లో తమ వికెట్లను 19 ఏళ్ల బౌలర్‌కు సమర్పించుకున్నారు.

ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత ఈ అనుభూతి ఎంతో బాగుందని… ఏం చెప్పాలో అర్థం కావడం లేదని కేశవ్‌ దబాస్‌ అన్నాడు. కేశవ్ దబాస్‌కు భారత బ్యాట్స్‌మెన్‌కు నెట్ బౌలర్‌గా అవకాసం ఇదే తొలిసారి. అంతకముందు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో అతడు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు నెట్ బౌలర్‌గా వ్యవహారించాడు.

స్మరించుకుందాం: ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీకి నేటితో ఆరేళ్లు పూర్తి

నెట్ ప్రాక్టీస్ అనంతరం టీమిండియా యువ ఫాస్ట్‌ బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ‘నువ్వే క్లబ్‌కు ఆడతావ్‌’ అని అడిగడం విశేషం. ప్రస్తుతం కేశవ్ దబాస్ ఢిల్లీలోని సురిందర్‌ ఖన్నా క్రికెట్‌ అకాడమీ తరఫున ఆడుతున్నాడు. గత సీజన్‌లో ఢిల్లీ అండర్‌-19 తరఫున ఒక మ్యాచ్‌ ఆడాడు. అయితే, ఈసారి మాత్రం కేశవ్‌కు ఆ ఆవకాశం దక్కలేదు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఈ ఏడాది జూన్‌లో కేశవ్‌ తండ్రి మరణించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అతడి సోదరి, సోదరుడు ఉద్యోగాలు చేస్తుండటంతో కేశవ్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నాడు. తన బౌలింగ్‌తో ఏదో ఒకరోజు తన కుటుంబానికి ఏదైనా చేయగలడని నమ్ముతున్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here