నెలకు రూ.210 ఇన్వెస్ట్ చేస్తే రూ.60,000 ఫిక్స్‌డ్ ఇయర్లీ పెన్షన్

0
4


నెలకు రూ.210 ఇన్వెస్ట్ చేస్తే రూ.60,000 ఫిక్స్‌డ్ ఇయర్లీ పెన్షన్

అసంఘటిత రంగంలో పనిచేసేవారికి ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన స్కీంను ( APY)ను తీసుకు వచ్చింది. NPS పథకం మాదిరి ఇది కూడా మంచి స్కీం. APY స్కీం కింద ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందుతారు. మీ కంట్రిబ్యూషన్, పథకంలో కొనసాగిన కాలాన్ని బట్టి పెన్షన్ మారుతుంది. నెలకు కేవలం రూ.42 నుంచి పెట్టుబడిగా పెట్టవచ్చు. దీంతో నెలకు రూ.1000 పెన్షన్ వస్తుంది. అదే రూ.210 ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి రూ.60,000 పొందవచ్చు.

భయం అవసరం లేని పెట్టుబడి

ఈ పథకంలో చేరితే ఎలాంటి భయాలు అవసరం లేదు. పెట్టుబడి పోతుందనే ఆందోళన ఏమాత్రం ఉండదు. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) పర్యవేక్షిస్తోంది. పదవి విరమణ తర్వాతనే పెన్షన్ పొందుతాం. పద్దెనిమిదేళ్ల నుంచి నలభై ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ స్కీంలో చేరాలి.

18 ఏళ్ల వయస్సులో రూ.42

18 ఏళ్ల వయస్సులో రూ.42

నలభై ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.291 నుంచి రూ.1,454 చెల్లించాలి. ఎంచుకునే పెన్షన్ ప్రాతిపదికన చెల్లించాల్సిన మొత్తం మారుతుంది. అటల్ పెన్షన్ స్కీం కాంట్రిబ్యూషన్ నెల, మూడు నెలలు, ఆరు నెలల వారీగా కూడా చెల్లించవచ్చు. నెలకు రూ.1000 నుంచి రూ.5000 మధ్య స్థిర నెలవారీ పెన్షన్ పొందాలంటే 18 ఏళ్ల వయస్సులో రూ.42 నుంచి రూ.210 చెల్లించాలి.

మీకు ఇష్టమైన పెన్షన్ స్కీం..

మీకు ఇష్టమైన పెన్షన్ స్కీం..

40 ఏళ్ల సమయంలో చేరితే నెలకు రూ.291 నుంచి రూ.1454 వరకు చెల్లించాలి. మీ ఆదాయాన్ని బట్టి పెన్షన్ స్కీంను లేదా పెన్షన్ స్కీంను బట్టి నెలకు చెల్లించాల్సిన మొత్తం ఎంచుకోవచ్చు. చిన్న వయస్సులో చేరితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.

ఆలస్యం చేస్తే రూ.1.60 లక్షలు అదనం!

ఆలస్యం చేస్తే రూ.1.60 లక్షలు అదనం!

35 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.5000 పెన్షన్ తీసుకుంటే 25 ఏళ్ల పాటు ప్రతి ఆరు నెలలకు రూ.5323 కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే మీరు మొత్తంగా రూ.2.66 లక్షలు డిపాజిట్ చేస్తారు. అదే మీరు 18 ఏళ్లకు స్కీంలో చేరితే రూ.5000 పెన్షన్ కోసం రూ.1.04 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఎంత ముందు చేరితే అంత ప్రయోజనం! అంటే ఆలస్యంగా చేరడం వల్ల రూ.1.60 లక్షల రూపాయలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

కేంద్రం అంతే మొత్తం జమ చేస్తుంది...

కేంద్రం అంతే మొత్తం జమ చేస్తుంది…

అటల్ పెన్షన్ యోజనలో చేరితే మీరు చెల్లించే మొత్తానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తం మీ అకౌంట్‌లో జమ చేస్తుంది. ఈ సౌకర్యం అయిదేళ్ల పాటు ఉంటుంది. 2015-16 నుంచి రూ.2019-2020 ఆర్థిక సంవత్సరం వరకు ఈ ప్రయోజనం ఉంటుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులుగా ఉండవద్దు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here