నెలకు రూ.210 చెల్లిస్తే రూ.8.5 లక్షలు, చిన్నప్పుడే చేరితే రూ.లక్షలు ఆదా!

0
1


నెలకు రూ.210 చెల్లిస్తే రూ.8.5 లక్షలు, చిన్నప్పుడే చేరితే రూ.లక్షలు ఆదా!

మన సంపాదనలో రిటైర్మెంట్ వయస్సులో ఆసరా కోసం ఎంతోకొంత మొదటి నుంచే ఇన్వెస్ట్ చేయడం మంచిది. రిటైర్మెంట్ తర్వాత భరోసా కలిగిన జీవనం కోసం వివిధ రకాల స్కీంలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టింది. ఇందులో అటల్ పెన్షన్ యోజన (APY) ఒకటి. ఈ పెన్షన్ స్కీం అత్యంత ప్రాచుర్యం పొందినవాటిల్లో ఒకటి. డెలివరీ బాయ్స్, వంటవాళ్లు వంటి అసంఘటితరంగంలో పని చేసేవారు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ సోషల్ సెక్యూరిటీ స్కీంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వృద్ధాప్యంలో మన ఇన్వెస్ట్‌మెంట్‌ను బట్టి నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పొందవచ్చు.

నెలకు రూ.210… 42 ఏళ్లకు రూ.8.5 లక్షలు

APYలో నెలకు రూ.42 ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.1,000 పెన్షన్‌గా పొందవచ్చు. రూ.210 ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏడాదికి రూ.60,000 (నెలకు రూ.5,000) పొందవచ్చు. తక్కువ వయస్సులోనే ఈ స్కీంలో చేరడం మంచిది. నెలకు రూ.210 చెల్లించడం ద్వారా 42 ఏళ్లలో మీ పెన్షన్ కార్పస్ రూ.8.5 లక్షలు అవుతుంది. సబ్‌స్క్రైబర్ మృతి చెందితే ఆ డబ్బును భార్య లేదా నామినీకి అందిస్తారు.

నామినీకి డబ్బులు...

నామినీకి డబ్బులు…

APY కాంట్రిబ్యూషన్ చార్ట్ ప్రకారం 42 ఏళ్ల పాటు చెల్లిస్తే నామినీకి రూ.1.7 లక్షలు వస్తుంది. 18 ఏళ్ల నుంచి నెలకు రూ.84 చెల్లిస్తూ వెళ్తే రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు అంటే 42 ఏళ్లలో కార్పస్ 3.4 లక్షలు అవుతుంది. నెలకు రూ.168 చెల్లిస్తే కార్పస్ అమౌంట్ రూ.6.8 లక్షలు అవుతుంది.

ఐటీ బెనిఫిట్స్

ఐటీ బెనిఫిట్స్

PFRDA వెబ్ సైట్ ప్రకారం మీరు చెల్లించే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. 2015 జూన్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ మధ్య చేరిన వారికి ఇది వర్తిస్తుంది. అయిదేళ్ల పాటు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కొనసాగుతుంది. ట్యాక్స్ పేయర్స్ కానివారు, ఇతర సోషల్ సెక్యూరిటీ స్కీంలలో లేనివారు అయి ఉండాలి. APY స్కీంలో సబ్‌స్క్రైబర్లకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80CCD కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. రూ.2 లక్షల వరకు బెనిఫిట్స్ ఉంటాయి.

చిన్న వయస్సులోనే చేరితే మంచిది

చిన్న వయస్సులోనే చేరితే మంచిది

సంపాదించే సమయంలో ఈ పథకంలో ఎంత చిన్న వయస్సులో చేరితే అంత మంచిది. 35 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరి నెలకు రూ.5,000 పెన్షన్ కావాలనుకుంటే ఆరు నెలలకు 5,323 చెల్లించాలి. ఇలా 25 ఏళ్ల పాటు చెల్లించాలి. మీరు చెల్లించిన మొత్తం రూ.2.66 లక్షలు అవుతుంది. అదే సమయంలో 18 ఏళ్లకు చేరితే మీరు చెల్లించే మొత్తం రూ.1.04 లక్షలు అవుతుంది. అంటే ఆలస్యంగా చేరడం వల్ల రూ.1.60 లక్షలు ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here