నెలరోజుల సెలవుపై సీపీ

0
4


నెలరోజుల సెలవుపై సీపీ

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ సీపీ కార్తికేయ నెలరోజుల పాటు సెలవుపై వెళ్తున్నారు. ఈయన డీఐజీగా పూర్తిస్థాయిలో పదోన్నతి పొందాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ అందుకోవాల్సి ఉంది.. ఈనెల 30 నుంచి 15 రోజుల పాటు హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పొందనున్నారు. అనంతరం మరో 15 రోజుల పాటు యూకే పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ వారం పాటు అధికారిక శిక్షణలో పాల్గొంటారు. మరో వారం రోజులు వ్యక్తిగత పర్యటనలో ఉంటారని సమాచారం.

ఎవరిని నియమిస్తారో..?

శిక్షణ అనంతరం పూర్తిస్థాయి డీఐజీగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈయన గత కొద్ది నెలలుగా తన బదిలీ కోసం ప్రయత్నాలు చేసుకొంటున్నారు. వీటన్నింటి దృష్ట్యా కమిషనరేట్‌కు కొత్త బాస్‌ను కేటాయించవచ్చన్న ప్రచారం ఊపందుకొంది. ఒకరిద్దరు అధికారుల పేర్లు సైతం తాజాగా తెరపైకి వచ్చాయి. సీపీ కార్తికేయ శిక్షణకు వెళ్లిన సమయంలో కామారెడ్డి ఎస్పీ శ్వేత నిజామాబాద్‌ ఇన్‌ఛార్జి సీపీగా వ్యవహరించనున్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here