నెలలో కూరగాయల ధర డబుల్, కిలో ఉల్లి రూ.25..ఏపీ ప్రభుత్వం ఆఫర్

0
3


నెలలో కూరగాయల ధర డబుల్, కిలో ఉల్లి రూ.25..ఏపీ ప్రభుత్వం ఆఫర్

న్యూఢిల్లీ: కూరగాయలు, ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత నెల కంటే ఉల్లి ధరలు ఏకంగా 300 రెట్లు పెరిగాయి. కూరగాయల ధరలు నెల రోజుల్లో డబుల్ అయ్యాయి. గత నాలుగు రోజుల్లో కూరగాయల ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ఉల్లి ధరలు మాత్రం రెండింతలు పెరిగాయి. మంగళవారం నోయిడాలోని కూరగాయల మార్కెట్లో ఉల్లి ధరలు రూ.45 నుంచి రూ.51 మధ్య ఉన్నాయి. కేవలం ఆలు ధర మాత్రమే గత నెల రోజులుగా స్థిరంగా ఉంది. ఇక్కడ గత నెల రోజుల్లో కూరగాయల ధరలు రెండింతలు అయ్యాయని, వారం రోజులుగా స్థిరంగా ఉన్నాయని చెబుతున్నారు.

ఏపీలో రూ.25కే కిలో ఉల్లి

ఉల్లి ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ వంటి వాటి ద్వారా రూ.22 రూపాయలకు, మదర్ డెయిరీ ద్వారా రూ.24కు ఉల్లిని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రజలకు రూ.25కే కిలో ఉల్లిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ కమిషనర్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి 300 టన్నుల ఉల్లిని కిలో రూ.30 చొప్పున కొనుగోలు చేశామని, రైతు బజార్లో రూ.25కు అందిస్తామన్నారు.

వినియోగదారుల జేబులు గుల్ల

వినియోగదారుల జేబులు గుల్ల

ఓ వైపు పండుగ సీజన్ కావడంతో కూరగాయలు, ఉళ్లి ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయని జలంధర్‌కు చెందిన వ్యాపారవేత్త మనోహర్ కుమార్ అన్నారు. పదిహేను రోజుల్లోనే ఉల్లి ధరలు ఏకంగా రూ.80కి పెరగడంతో వినియోగదారుల జేబులు గుల్ల అవుతున్నాయని చెబుతున్నారు.

20 శాతం పెరుగుదల

20 శాతం పెరుగుదల

భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లితో పాటు ఇతర కూరగాయల పంటలు కూడా నీట మునిగాయని, ధరలు పెరగడానికి ఇది కారణమని మరో వ్యాపారి చెప్పారు. గ్రీన్ పీస్, క్యాప్సికమ్, కోరియాండర్ ధరలు పెరుగుతున్నాయని, గత పదిహేను రోజుల్లో 20 శాతం పెరుగుదల కనిపించిందని ప్రమోద్ శర్మ అనే వ్యాపారి అన్నారు. ఉల్లి రూ.100కు చేరినా చేరుతుందన్నారు. ముఖ్యంగా టమాటా, క్యాలీఫ్లవర్ ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు. కూరగాయల ధరలు ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో ఎలా ఉన్నాయంటే…

పచ్చ బఠానీ...

పచ్చ బఠానీ…

బఠానీ ఆగస్ట్ నెలలో కిలోకు రూ.90 నుంచి రూ.100 వరకు ఉండగా, సెప్టెంబర్ ప్రారంభంలో రూ.100 నుంచి రూ.120 మధ్య ఉంది. సెప్టెంబర్ చివరలో రూ.120 నుంచి రూ.150కి పెరిగింది.

క్యాలీఫ్లవర్

క్యాలీఫ్లవర్

క్యాలీఫ్లవర్ నెలలో కిలోకు రూ.40 నుంచి రూ.50 వరకు ఉండగా, సెప్టెంబర్ ప్రారంభంలో రూ.60 నుంచి రూ.70 మధ్య ఉంది. సెప్టెంబర్ చివరలో రూ.90 నుంచి రూ.100కి పెరిగింది.

టొమాటో

టొమాటో

టొమాటో ఆగస్ట్ నెలలో కిలోకు రూ.80 నుంచి రూ.90 వరకు ఉండగా, సెప్టెంబర్ ప్రారంభంలో రూ.70 నుంచి రూ.60 మధ్య ఉంది. సెప్టెంబర్ చివరలో రూ.50 నుంచి రూ.40కి పెరిగింది.

ఉల్లి

ఉల్లి

ఉల్లి ఆగస్ట్ నెలలో కిలోకు రూ.20 నుంచి రూ.25 వరకు ఉండగా, సెప్టెంబర్ ప్రారంభంలో రూ.25 నుంచి రూ.30 మధ్య ఉంది. సెప్టెంబర్ చివరలో రూ.70 నుంచి రూ.80కి పెరిగింది.

కొత్తి మీర

కొత్తి మీర

కొత్తిమీర ఆగస్ట్ నెలలో రూ.100 నుంచి రూ.120 వరకు ఉండగా, సెప్టెంబర్ ప్రారంభంలో రూ.140 నుంచి రూ.160 మధ్య ఉంది. సెప్టెంబర్ చివరలో రూ.160 నుంచి రూ.180కి పెరిగింది.

యెల్లో క్యాప్సికం

యెల్లో క్యాప్సికం

యెల్లో క్యాప్సికం ఆగస్ట్ నెలలో రూ.120 నుంచి రూ.140 వరకు ఉండగా, సెప్టెంబర్ ప్రారంభంలో రూ.160 నుంచి రూ.180 మధ్య ఉంది. సెప్టెంబర్ చివరలో రూ.200 నుంచి రూ.220కి పెరిగింది.

దోస

దోస

దోస ఆగస్ట్ నెలలో రూ.50 నుంచి రూ.60 వరకు ఉండగా, సెప్టెంబర్ ప్రారంభంలో రూ.60 నుంచి రూ.70 మధ్య ఉంది. సెప్టెంబర్ చివరలో రూ.70 నుంచి రూ.75కి పెరిగింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here