నెల రోజుల కనిష్టానికి మార్కెట్లు ! మళ్లీ క్రాష్ ల్యాండింగ్

0
1


నెల రోజుల కనిష్టానికి మార్కెట్లు ! మళ్లీ క్రాష్ ల్యాండింగ్

స్టాక్ మార్కెట్‌ను ఒంటి చేత్తో నిలబెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నించినప్పటికీ మార్కెట్ మాత్రం నిలబడలేకపోయింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం దిగివస్తోందనే అంచనాల నేపధ్యంలో గతవారం ఆఖర్లో కొద్దిగా కొనుగోళ్ల మద్దతు కనిపించింది. అయితే కేవలం మాటలు గారడీతో ఏమీ పనిజరగబోదని ఈ రోజు ట్రేడ్ ఛార్ట్‌ను బట్టి అర్థమైంది. గతవారం కొద్దోగొప్పో వచ్చిన లాభాలన్నీ హరించుకుపోయి మళ్లీ నిఫ్టీ 11 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 700 పాయింట్లు కరిగిపోయింది. ఉదయం నుంచి ఆఖరి ట్రేడింగ్ సెషన్ వరకూ ఎక్కడా మార్కెట్లు కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. చివరకు సెన్సెక్స్ 624 పాయింట్ల నష్టంతో 36,958 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 184 పాయింట్లు దిగొచ్చి 10925 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 703 పాయింట్ల నష్టంతో 27729 వద్ద ఆగింది.

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్, సన్ ఫార్మా, గెయిల్, జీ ఎంటర్‌టైన్మెంట్ లిమిటెడ్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐషర్ మోటార్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

నిఫ్టీ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఒకటిన్నర నుంచి రెండు శాతం వరకూ కుప్పకూలాయి. సెక్టోరల్ ఇండిసిస్‌లో ఒక్కటి కూడా లాభాల్లో లేదు. ప్రధానంగా ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ, ఎఫ్ఎంసిజి రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మరింత తీవ్రమైంది.

ఆటోకు పోటు

జూలై నెలలో డీలర్ల దగ్గర ఇన్వెంటరీలు మరింతగా పెరిగిపోయాయని, ముఖ్యంగా ఈ నెలలో ప్యాసింజర్ సేల్స్ దారుణంగా పడిపోయిందంటూ వచ్చిన వార్తలు ఆటో స్టాక్స్‌ను కుదేలయ్యాలా చేసింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 4 శాతం కుప్పకూలింది. ఇందులో మదర్సన్‌సుమి 9 శాతం, భారత్ ఫోర్జ్ 7 శాతం, బాష్ 6 శాతం నష్టపోయాయి. మహీంద్రా, ఐషర్ మోటార్స్, టీవీఎస్ మోటార్స్, మారుతి స్టాక్స్ 5 శాతం వరకూ దిగొచ్చాయి.

రిలయన్స్‌ రోరింగ్ ర్యాలీ

ఏజీఎంలో ముకేష్ అంబానీ చేసిన అనేక ప్రకటనల నేపధ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఈ రోజు ఎగిరి గంతేసింది. గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు పది శాతానికి పైగా పెరిగింది. అనూహ్యమైన వాల్యూమ్స్‌తో స్టాక్ పెరిగింది. చివరకు 9.8 శాతం లాభంతో రూ.1275 దగ్గర క్లోజైంది. ఈ రోజు రిలయన్స్ గనుక నష్టపోయి ఉంటే.. మార్కెట్ (నిఫ్టీ) మరో వంద పాయింట్లు తక్కువ లేకుండా పడిపోయి ఉండేది.

ఐదేళ్ల కనిష్టానికి మహీంద్రా

మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఆటోమొబైల్ ప్యాక్ అంతా బలహీనపడ్తున్న నేపధ్యంలో ఈ స్టాక్ మరింత నీరసించిపోయింది. ప్రస్తుత ధర 2014 ఏప్రిల్ నాటికి వచ్చింది. చివరకు ఈ స్టాక్ 6 శాతం నష్టంతో రూ.512 దగ్గర క్లోజైంది.

సన్ ఫార్మా భేష్

సన్ ఫార్మా ఆదాయం 16 శాతం, నికర లాభం 31.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ రోజు ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మార్జిన్లు 23 నుంచి 23.5 శాతానికి పెరిగాయి. దీంతో ఈ స్టాక్ 4 శాతం వరకూ పెరిగింది. చివరకు రూ. 437 దగ్గర క్లోజైంది.

గాడ్‌ఫ్రే ఫిలిప్స్.. ఓ మై గాడ్

త్రైమాసిక ఫలితాల్లో ఈ స్టాక్ అత్యద్భుత పనితీరు కనబర్చింది. దీంతో స్టాక్ 20 శాతం అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. ఆదాయం 40 శాతం పెరగగా నికర లాభం 2.1 రెట్లు ఎగిసింది. దీంతో ఈ స్టాక్ 20 శాతం లాభంతో రూ.851 దగ్గర లాక్ అయింది.

బాష్‌కు రిజల్ట్స్ దెబ్బ

త్రైమాసిక ఫలితాల్లో ఆదాయం 13.5 శాతం క్షీణించడం స్టాక్‌కు షాక్ ఇచ్చింది. రూ.82 కోట్ల ఊహించని లాస్ కూడా కుదేలయ్యేలా చేసింది. దీంతో స్టాక్ కూడా రియాక్ట్ అయింది. చివరకు రూ.13518 దగ్గర క్లోజైంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here