నేటి నుంచి యాషెస్‌ మూడో టెస్టు.. ఆర్చర్‌పై ఇంగ్లండ్‌ భారీ ఆశలు!!

0
1


లీడ్స్‌: ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచే యాషెస్‌ మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఇంగ్లాండ్‌ ఉండగా.. ఈ మ్యాచ్ కూడా గెలిచి ఆధిక్యాన్ని కొనసాగించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. తొలి టెస్టులో గెలిచిన ఆసీస్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించేందుకు ఆస్ట్రేలియాకు ఇదే మంచి అవకాశం.

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తలైవాస్‌పై జైపుర్‌ విజయం

స్మిత్ లేకుండానే:

స్మిత్ లేకుండానే:

తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలతో ఆస్ట్రేలియా జట్టును గెలిపించిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అయితే ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ వేసిన బంతి అతడికి బలంగా తాకడంతో ఆటకు దూరం చేసింది. గాయం నుంచి కోలుకోకపోవడంతో మూడో టెస్టు నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఇది ఆసీస్‌కు పెద్ద ఎదురు దెబ్బ.

ఫామ్‌లో బౌలర్లు:

ఫామ్‌లో బౌలర్లు:

ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నాడు. రెండు టెస్టుల్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. మరో ఓపెనర్ బెన్ క్రాఫ్ట్ కూడా పరుగులు చెయ్యట్లేదు. ఉస్మాన్ ఖవాజా మోస్తరుగా రాణిస్తున్నా.. హెడ్, వేడ్, పైన్ విఫలమయ్యారు. స్మిత్ కూడా లేకపోవడంతో లాబషేన్, ఖవాజాపై భారం పడనుంది. అందరూ రాణిస్తేనే ఆసీస్ భారీ స్కోర్ చేయగలదు. అయితే ఆసీస్ బౌలర్లు రాణించడం కలిసొచ్చే అంశం. కమిన్స్, లయన్, హాజల్ వుడ్ ఫామ్‌లో ఉన్నారు.

ట్యాక్లింగ్‌లో సుర్జీత్‌ హవా.. బుల్స్‌కు పల్టాన్‌ షాక్!!

 ఆర్చర్‌పై ఆశలు:

ఆర్చర్‌పై ఆశలు:

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ బ్యాటింగ్‌ పూర్తిగా గతి తప్పడం జట్టును ఇబ్బందుల్లో పడేస్తోంది. అయితే రూట్ ఎప్పటికీ ప్రమాదకారమే. ఓపెనర్ బుర్న్స్ ఫామ్‌లో ఉన్నా.. మరో ఓపెనర్ రాయ్ పరుగులే చేయడం లేదు. ఇకనైనా రాయ్ మంచి ఆరంభం ఇవ్వాల్సి ఉంది. జో డెన్లి, జొస్ బట్లర్ గాడిలో పడాలి. జానీ బెయిరిస్టో, బెన్ స్టోక్స్ పరుగులు చేయడం సానుకూలాంశం. జేమ్స్‌ అండర్సన్‌ గైర్హాజరీలో ఇంగ్లండ్‌ బౌలింగ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. సీనియర్‌ స్టూవర్ట్‌ బ్రాడ్‌ రాణిస్తున్నా..అతనికి మిగతా బౌలర్ల నుంచి సరైన సహకారం కరువైంది. అరంగేట్రం టెస్ట్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టిన ఆర్చర్‌పై ఇంగ్లండ్‌ భారీ ఆశలు పెట్టుకుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here