నేడు ఉద్యోగ మేళా

0
2


నేడు ఉద్యోగ మేళా

నిజామాబాద్‌(కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: జాతీయ జీవనోపాదుల పథకంలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నిజామాబాద్‌లో గురువారం(నేడు) ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆర్మూర్‌ రోడ్డులో ఉన్న లక్ష్మి కల్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కార్యక్రమం ఉంటుంది. 18-35 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. నిజామాబాద్‌ నగరం, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ పట్టణాలకు చెందిన వారు మాత్రమే హాజరు కావల్సి ఉంటుంది. హైదరాబాద్‌, నిజామాబాద్‌కు చెందిన పలు కంపెనీల వారు వస్తారు. అభ్యర్థులతో పాటు కంపెనీల ప్రతినిధుల కోసం కావల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా హాజరై మేళాను ప్రారంభిస్తారు. కల్యాణ మండపంలో ఏర్పాట్లను బుధవారం మెప్మా పథక సంచాలకులు రాములు తన సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. మేళాకు వచ్చే వారు తమ విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలతో హాజరు కావాలని ఆయన తెలిపారు. నగరంతో పాటు పట్టణాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here