నేడు భాజపా కార్యశాలకు మురళీధర్‌రావు రాక

0
2


నేడు భాజపా కార్యశాలకు మురళీధర్‌రావు రాక

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు బుధవారం ఆర్మూర్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు పెర్కిట్‌ సిటీగార్డెన్‌ ఫంక్షన్‌ హాలులో నిర్వహించనున్న ఆర్మూర్‌ నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రాల స్థాయి కార్యకర్తల కార్యశాలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నట్లు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్‌కుమార్‌, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ద్యాగ ఉదయ్‌, పూజ నరేందర్‌ తెలిపారు. కార్యశాలలో భాజపా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నియోజకవర్గ బాధ్యుడు వినయ్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని చెప్పారు. వివిధ మండలాల నాయకులు, పోలింగ్‌ కేంద్రాల స్థాయి అధ్యక్ష, కార్యదర్శులు హాజరు కావాలని కోరారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆర్మూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి జలాభిషేకం, చేపూర్‌ క్షత్రియ ఇంజినీరింగ్‌ కళాశాలలో పండిట్‌ విగ్రహాన్ని శుద్ది చేసి, పూలమాల వేస్తామని తెలిపారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here