నేను కూడా లైంగికదాడి బాధితుడినే.. పార్లమెంట్‌లో ప్రకటించిన ఆ ఎంపీ ఎవరంటే..?

0
2


నేను కూడా లైంగికదాడి బాధితుడినే.. పార్లమెంట్‌లో ప్రకటించిన ఆ ఎంపీ ఎవరంటే..?

న్యూఢిల్లీ : దేశంలో లైంగికదాడులు ఆందోళన కలిగిస్తోన్నాయి. చిన్న పిల్లలను కూడా వదలడం లేదు కీచకులు. అయితే దీనిపై పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా తన అనుభవాన్ని పేర్కొన్నారు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్. తనకు జరిగిన ఘటనను పంచుకోవడంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు.

పార్లమెంట్‌లో లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించడం (పోక్సో)పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ మాట్లాడారు. తనకు 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు లైంగికదాడికి గురయ్యానని తెలిపారు. చిన్న పిల్లలపై లైంగిక హింస ఇంట్లో నుంచి మొదలవుతుందన్నారు. అయితే ప్రజాజీవితంలో ప్రజలు దీని గురించి విసృతంగా చర్చించాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే దీనిపై పిల్లలకు అవగాహన వస్తుందని చెప్పారు.

తనకు జరిగిన ఘటనను డెరెక్ వివరించారు. 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు టెన్సీస్ ఆడి వస్తున్నానని పేర్కొన్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి తనను లైంగికంగా హింసించాడని చెప్పారు. నిక్కర్, టీ షర్ట్ వేసుకున్న తనను ఒకతను రేప్ చేశాడని సభలో చెప్పారు. వాస్తవానికి ఈ విషయం తాను చెప్పి ఉండాల్సింది కాదు .. కానీ మనం ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. చెప్పుకోవాలి. చిన్న పిల్లలను లైంగిక హింస నుంచి కాపాడాలి అని సభకు వివరించారు. అయితే డెరెక్ ధైర్యాన్ని కేంద్రమంత్రి ఇరానీ ప్రసంశించారు. తనపై జరిగిన లైంగికదాడిని నిర్భయంగా చెప్పిన డెరెక్ మీకు జోహార్లు అని కొనియాడారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here