నో క్యాష్‌బ్యాక్: క్రెడిట్‌కార్డ్‌తో పెట్రోల్ కొట్టించుకుంటున్నారా.. జాగ్రత్త!!

0
9


నో క్యాష్‌బ్యాక్: క్రెడిట్‌కార్డ్‌తో పెట్రోల్ కొట్టించుకుంటున్నారా.. జాగ్రత్త!!

బంకుల్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. మరో నాలుగు రోజుల్లో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు ద్వారా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తే కొంత మొత్తం డిస్కౌంట్ వచ్చేది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇది వర్తించదు. క్రెడిట్ కార్డు ఉపయోగించేవారికి ఇది బ్యాడ్ న్యూస్.

క్యాష్ బ్యాక్, డిస్కౌంట్‌కు చెల్లుచీటి

బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తే క్రెడిట్ కార్డు పైన 0.75 శాతం డిస్కౌంట్ లేదా క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అయితే కస్టమర్లకు ఈ ప్రయోజనం ఇక నుంచి ఉండదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (sBI) కస్టమర్లకు మెసేజ్ వచ్చింది. కేవలం ఎస్పీఐ కస్టమర్లకే కాదు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డు హోల్డర్లకు కూడా ఈ సందేశం వచ్చింది. మిగతా బ్యాంకులు కూడా ఇదే మార్గంలో నడిచే అవకాశముంది.

కార్డు ద్వారా డబ్బులు చెల్లిస్తే డిస్కౌంట్.. ప్రోత్సాహం

కార్డు ద్వారా డబ్బులు చెల్లిస్తే డిస్కౌంట్.. ప్రోత్సాహం

2016 నవంబర్ 8వ తేదీన నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రోత్సహించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ (HPCL) వంటి ఆయిల్ కంపెనీలు కార్డు ద్వారా డబ్బులు చెల్లించేవారికి డిస్కౌంట్ ఇస్తున్నాయి. తద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రోత్సహిస్తోంది.

అక్టోబర్ 1 నుంచి ఈ వెసులుబాటు ఉండదు

అక్టోబర్ 1 నుంచి ఈ వెసులుబాటు ఉండదు

కార్డు ద్వారా చెల్లింపులు జరిపేవారికి డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం… ఆయిల్ కంపెనీలకను గతంలో ఆదేశించింది. దీనిని మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)గా వ్యవహరించారు. దీనిని రిటైలర్ చెల్లించారు. అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆ వెసులుబాటు ఉండదు. వచ్చే నెల నుంచి అన్ని క్రెడిట్ కార్డు చెల్లింపులపై తగ్గింపును నిలిపేయాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

డెబిట్, ఇతర డిజిటల్ మోడ్స్‌పై డిస్కౌంట్ కొనసాగుతాయి

డెబిట్, ఇతర డిజిటల్ మోడ్స్‌పై డిస్కౌంట్ కొనసాగుతాయి

క్రెడిట్ కార్డుపై డిస్కౌంట్లకు దూరం జరిగినప్పటికీ, డెబిట్ కార్డు చెల్లింపులపై డిస్కౌంట్స్ కొనసాగుతాయని తెలుస్తోంది. అలాగే ఇతర డిజిటల్ మోడ్స్ పేమెంట్స్ పద్ధతులపై కూడా కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు ఇస్తున్న ఫ్యూయల్ సర్‌ఛార్జీ ఫెసిలిటీని ఆయిల్ రంగ కంపెనీలు వెనక్కి తీసుకుంటుండటం గమనార్హం.

భారీగా నష్టం

భారీగా నష్టం

IOC, BPCL, HPCL వంటి ఫ్యూయల్ రిటైల్ కంపెనీలు డిస్కౌంట్ కారణంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,431 కోట్లు నష్టపోయాయి. క్యాష్‌బ్యాక్ రూపంలో రూ.1,165 కోట్లు, బ్యాంకుల MDR చార్జీల రూపంలో రూ.266 కోట్లు నష్టపోయాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,000 కోట్లు నష్టపోయాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here